
సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్, నేషనల్ అవార్డు విన్నర్ శివమొగ సుబ్బన్న(83) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కన్నడ గాయకుడైన ఆయన గురువారం రాత్రి బెంగళూరులోని జయదేవ హాస్పిటల్‌లో గుండెపోటుతో కన్నుమూసినట్లు సినీవర్గాల నుంచి సమాచారం.
చదవండి: అది కేవలం ఇండస్ట్రీలోనే కాదు, సమాజమే అలా ఉంది: శ్రుతి హాసన్
కాగా శాండల్‌వుడ్‌లో జాతీయ అవార్డు అందుకున్న తొలి గాయకుడిగా సుబ్బన్న గుర్తింపు పొందారు. ‘కాదే కుద్రే ఒడి’ అనే పాటకు ఆయన అవార్డును అందుకున్నారు. కువెంపు రచించిన ‘బారిసు కన్నడ డిండిమావ’ పాట ఆయనకు పాపులారిటీని తెచ్చిపెట్టింది.