
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ విలన్‌గా నటించబోతున్నారంటూ SIIMA (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. దీంతో సుదీప్( Sudeep) కూడా తనదైన స్టైల్లో సైమాపై పంచ్‌లు వేశారు. తమిళ హీరో శింబు, వెట్రిమారన్ మూవీలో విలన్ పాత్ర కోసం సుదీప్, ఉపేంద్ర ముందు వరుసలో ఉన్నారంటూ సైమా ఒక పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే సుదీప్ రియాక్ట్ అయ్యారు.
సైమా గురించి సుదీప్ ఇలా అన్నారు. మీరు సైమా అవార్డ్స్ పేరుతో సాయంత్ర సమయంలో చేసే వేడుకపై నాకు అపారమైన గౌరవం ఉంది. కానీ, మీ ఈ వార్తల విషయానికొస్తే.. ఒక సూచన ఇవ్వాలనిపించింది. ఇక నుంచి మీ మూలాలను మార్చుకొని గాసిప్స్ వార్తలు ప్రచారం చేసుకోండి. వచ్చే ఏడాది నుంచి బెస్ట్ ఫేక్ న్యూస్ అవార్డ్ పేరుతో సైమాలో చోటు కల్పించండి. అందులోనైనా మీ వార్తకు అవార్డ్ వస్తుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను. అని సుదీప్ కౌంటర్ ఇచ్చారు. అందుకు సైమా కూడా సరదాగా స్పందించింది. మీరు ఇచ్చిన సలహా తప్పకుండా పాటిస్తాం అంటూ మరో ట్వీట్ చేసింది. తమకు వచ్చే సమాచారాన్ని ఇంకాస్త మెరుగుపరుచుకుంటామని చెప్పింది. అయితే మొదట చేసిన పోస్ట్‌ను సైమా వెంటనే తొలగించింది.
కన్నడ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా ఉన్న సుదీప్.. తను నటించిన కొత్త చిత్రం 'మార్క్' కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. 2025 క్రిస్మస్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రానికి విజయ్ కార్తీకేయ దర్శకత్వం వహించారు. గతేడాది విడుదలై 'మాక్స్' చిత్రానికి కూడా ఆయనే దర్శకత్వం వహించారు. అయితే, శివరాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి. శెట్టి నటించిన 45తో మార్క్ చిత్రానికి గట్టి పోటీ తప్పదని తెలుస్తోంది. ఆపై అదే సమయంలో దర్శన్ నటించిన ది డెవిల్ కూడా విడుదల కానుంది.
Well @siima ...
Huge respect for wat u do wth ua awards evenings.
As for these news are concerned I have a suggestion.
Whisper🤫: change ur sources.
🤗
Also wanted to know if there is a "Best Fake News Award" coming up next SIIMA!! 😁 https://t.co/ydkA7k1E4W— Kichcha Sudeepa (@KicchaSudeep) October 10, 2025