ఇంట‌ర్వ్యూ త‌ర్వాత అమ్మ ఏడుస్తూనే ఉంది | Kangana Ranaut Says Her Mother Cried After Her Interview | Sakshi
Sakshi News home page

అమ్మ న‌న్ను ఏడ్చేలా చేసింది

Aug 30 2020 4:35 PM | Updated on Aug 30 2020 4:43 PM

Kangana Ranaut Says Her Mother Cried After Her Interview - Sakshi

బాలీవుడ్‌లో డ్ర‌గ్ మాఫియా ఉంద‌ని సంచ‌ల‌న హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ మీడియా చ‌ర్చావేదిక‌గా బాంబు పేల్చిన విష‌యం తెలిసిందే. సెల‌బ్రిటీలు మంచినీళ్లు తాగినట్లుగా డ్ర‌గ్స్ సేవిస్తున్నార‌ని, దాని ప‌ర్య‌వ‌సానాల‌ను కూడా అనుభ‌విస్తున్నార‌ని ఆమె ఆరోపించారు. త‌న పైన కూడా డ్ర‌గ్స్ ప్ర‌యోగించారని వెల్ల‌డించారు. బాలీవుడ్ మాఫియా గురించి వ్య‌తిరేకంగా మాట్లాడితే నోరు మూయించేస్తార‌ని చెప్పుకొచ్చారు. ఇలా ఎన్నో అంశాల‌ను కంగ‌నా శ‌నివారం నాడు ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో నిర్భ‌యంగా వెల్ల‌డించారు. అనంత‌రం ఆ రోజు రాత్రి వేళ‌ ఆమె త‌న త‌ల్లి ఆశార‌నౌత్‌కు ఫోన్ చేసి ఇంట‌ర్వ్యూ ఎలా ఉంద‌ని అడిగారు. (చ‌ద‌వండి: ‘బాయ్‌కాట్‌ కంగనా రనౌత్‌’)

అందుకు ఆమె ఎలా స్పందించిందో ట్విట‌ర్‌లో తెలియజేశారు. "ఇంట‌ర్వ్యూ న‌చ్చిందా అని ఎంతో ఉత్సాహంగా అమ్మ‌కు కాల్ చేశాను. కానీ అమ్మ క‌న్నీళ్లు పెట్టుకుంటూ దుఃఖించింది. ఏడుస్తూనే... 'నీకు పెళ్లి కావాల‌న్న కోరిక‌తో ఇప్ప‌టికీ ఉప‌వాసాలు చేస్తున్నాను. కానీ నువ్వు మాత్రం నీకు జ‌రిగిన భ‌యంక‌ర‌మైన అనుభ‌వాల గురించి ఈ ప్ర‌పంచానికి చెప్తూ ఉంటున్నావు' అని బాధ‌ప‌డింది. ఇప్పుడేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తోంది. ఆమె కావాల‌ని ఏడవ‌‌లేదు, కానీ న‌న్ను మాత్రం ఏడ్పించాల‌నుకుంది. ఏం చేయాలి?" అని ట్విట‌ర్‌లో రాసుకొచ్చారు. ఇందుకు ఆమె తల్లితో దిగిన ఫొటోల‌ను జ‌త చేశారు. (చ‌ద‌వండి: అమీర్‌, అనుష్క‌ ఎందుకు నోరు విప్ప‌లేదు?)

Advertisement
 
Advertisement
Advertisement