కంగనాను అరెస్టు చేయొద్దు; బాంబే హైకోర్టు

Kangana Ranaut And Her Sister Granted Interim Protection From Arrest - Sakshi

ముంబై: బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ను అరెస్టు చేయోద్దని బాంబే హైకోర్టు మహరాష్ట్ర పోలీసులను ఆదేశించింది. కంగనాతో పాటు ఆమె సోదరి రంగోలి చందెల్‌పై ఇటీవల ముంబై పోలీసుల దేశద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కంగన సిస్టర్స్‌ సోషల్‌ మీడియా పోస్టులు, ఇంటర్యూలు ఉన్నాయని క్యాస్టింగ్ డైరెక్టర్ మాన్వల్ అలీ సయ్యద్ ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కంగనా సిస్టర్స్‌ విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు సమన్లు జారీ చేశారు. అయితే కంగన మాత్రం సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ విచారణకు హాజరుకాకుండా వాయిదా వేస్తున్నారు. దీంతో పోలీసులు షూటింగ్‌లకు వెళ్లే సమయం ఉంటుంది కానీ విచారణకు హజరయ్యే సమయం ఉండదా అని వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కంగన, రంగోలిలను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు.  (చదవండి: న్యాయవ్యవస్థను కించిపర్చిందంటూ ఫిర్యాదు)

ఈ నేపథ్యంలో తమపై ఉన్న కేసును కొట్టేసేలా ఆదేశాలను ఇవ్వాలని కంగన, రంగొలీలు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తాము సోషల్‌ మీడియాలో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, కేవలం తమ ఉద్దేశాలను మాత్రమే వెల్లడించామంటూ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. అంతేగాక పోలీసుల సమన్లను తాము గౌరవిస్తున్నామన్నారు. అయితే పోలీసులు తమను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. కంగన వాదనను విన్న హైకోర్టు ముంబై పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని ఇప్పుడే అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అదే విధంగా జనవరి 8న ముంబై పోలీసుల ముందు హాజరుకావాల్సిందిగా కంగన, రంగోలీలను న్యాయస్థానం ఆదేశించింది. (చదవండి: పెళ్లికి ముందు శృంగారం తప్పుకాదు: హీరోయిన్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top