విడాకుల రూమర్స్‌కి ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చిన మెగా అల్లుడు | Kalyan Dev Full Stops Divorce Rumors With Sreeja | Sakshi
Sakshi News home page

Kalyan Dev: మెగా ఫ్యామిలీలో విడాకుల రూమర్స్‌కు చెక్‌ పడినట్లేనా?

Nov 14 2021 12:38 PM | Updated on Nov 14 2021 1:32 PM

Kalyan Dev Full Stops Divorce Rumors With Sreeja - Sakshi

Kalyan Dev Sreeja Divorce Rumors: సమంత-నాగచైతన్య విడాకుల తర్వాత ఇండస్ట్రీకి చెందిన మరో జంట విడిపోనున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ-హీరో కల్యాణ్‌దేవ్‌లు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు దీపావళి సెలబ్రేషన్స్‌లో సైతం వీరు కనిపించలేదు. అంతేకాకుండా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో పాటు మెగా హీరోలందరూ కలిసి దిగిన ఫొటోలోనూ కళ్యాణ్ దేవ్ మిస్ అయ్యాడు.

సాధారంగా మెగా ఫ్యామిలీలో జరిగే దాదాపు అన్ని వేడుకల్లో కల్యాణ్‌ దేవ్‌ హాజరవుతుంటారు. అలాంటిది ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కనిపించకపోవడంతో ఈ వార్తలు నిజమేనేమో అన్న అనుమానం కొందరిలో మొదలైంది. తాజాగా కల్యాణ్‌దేవ్‌ ఒక్క ఫోటోతో రూమర్స్‌కి చెక్‌ పెట్టారు. భార్య శ్రీజ బర్త్‌డే సందర్భంగా..హ్యాపీ బర్త్‌డే స్వీటూ అంటూ లవ్‌ సింబల్‌ను జతచేస్తూ ఫోటోను పోస్ట్‌ చేశాడు.

దీనికి శ్రీజ ఇన్‌స్టా అకౌంట్‌ను కూడా ట్యాగ్‌ చేశాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విడాకుల రూమర్స్‌కి బ్రేక్‌ పడినట్లయ్యింది. 2016లో శ్రీజ-కల్యాణ్‌ల వీరి పెళ్లి జరిగిన సం‍గతి తెలిసిందే. కాగా  విజేత సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్‌ దేవ్‌ ఇటీవలె సూపర్‌ మచ్చి, కిన్నెరసాని షూటింగ్స్‌ పూర్తి చేశారు. త్వరలోనే ఈ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement