హీరోయిన్‌గా బిగ్‌బాస్ ఫేమ్.. టీజర్ రిలీజ్! | Sakshi
Sakshi News home page

Kalasa Movie Teaser: హీరోయిన్‌గా బిగ్‌బాస్ ఫేమ్.. టీజర్ రిలీజ్!

Published Thu, Nov 23 2023 8:54 PM

Kalasa Movie Teaser launched By Director Sagar Chandra - Sakshi

బిగ్‌బాస్‌ ఫేమ్‌ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కలశ’. కొండ రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డాక్టర్‌ రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భీమ్లా నాయక్‌ డైరెక్టర్‌ సాగర్‌ చంద్ర టీజర్‌ను విడుదల చేశారు.

దర్శకుడు కొండా రాంబాబు మాట్లాడుతూ...' చిత్రబృంద సభ్యులు పగలు, రేయి బాగా కష్టపడ్డారు. అనురాగ్‌, భానుశ్రీ, సోనాక్షి వర్మ, రోషిణిలు అద్భుతంగా నటించారు. మా అందరినీ వెనుక ఉండి నడిపించిన స్వామి, మేడమ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘కలశ’ అనే టైటిల్‌ ఈ సినిమాలోని క్యారెక్టర్‌. అందుకే కలశం నుంచి ‘కలశ’ను తీసుకోవడం జరిగింది. బ్రెయిన్‌కి, హార్ట్‌కి లింక్‌ చేస్తూ రాసుకున్న సినిమా ఇది. అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.' అని అన్నారు.

దర్శకుడు సాగర్‌ చంద్ర మాట్లాడుతూ... 'టీజర్‌ చాలా బాగుంది. మంచి ఎమోషన్‌, యాక్షన్‌ ఉంది. కాబట్టి ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. అందరికీ అల్‌ ది బెస్ట్‌' అని అన్నారు.

నిర్మాత చంద్రజ మాట్లాడుతూ...' రాంబాబు చాలా హార్డ్‌ వర్కర్‌. ఈ కథకు కావాల్సిన కమర్షియల్‌ హంగులతో తెరకెక్కించాం. ఎక్కడా అశ్లీలత లేకుండా చూశాం. సెన్సార్‌ వారు కూడా కట్స్‌ లేకుండా సర్టిఫికెట్‌ ఇవ్వడం మా తొలి విజయంగా భావిస్తున్నా. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్‌, రవివర్మ కీలక పాత్రలు పోషించారు.  ఈ మూవీకి విజయ్‌ కురాకుల సంగీతమందించారు. 

Advertisement
 
Advertisement