Kala Telugu Movie Official Trailer Out Now - Sakshi
Sakshi News home page

Kala: కాలా ట్రైలర్‌ వచ్చేసింది..

May 31 2021 3:24 PM | Updated on Jul 31 2021 11:46 AM

జంతువు కోసం జంతువులా మారిన మనుషులు క్రూరంగా కొట్టుకోవడం, సౌండ్‌ ఎఫెక్ట్స్‌ దీనికి తగ్గట్లు ఉండటం...

యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాలకు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా అడ్డాగా మారిపోయింది. ఓవైపు స్ట్రయిట్‌ తెలుగు సినిమాలు అందిస్తూనే మరోవైపు అనువాద చిత్రాలకు సైతం పచ్చ తివాచీ పరుస్తోంది. అందులో భాగంగా తాజాగా మలయాళ హిట్‌ మూవీ కాలా తెలుగులో అనువాదమవుతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ సోమవారం రిలీజైంది. జంతువు కోసం జంతువులా మారిన మనుషులు క్రూరంగా కొట్టుకోవడం, సౌండ్‌ ఎఫెక్ట్స్‌ దీనికి తగ్గట్లు ఉండటంతో యాక్షన్‌ ప్రియులను ఈ ట్రైలర్‌ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ ఏడాది మార్చి 25న థియేటర్లలో రిలీజ్‌ అయిన కాలా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. దీని కథ విషయానికొస్తే.. అనుకోకుండా జరిగిన ఓ హింసాత్మక ఘటనలో చనిపోయిన శునకం కారణంగా ఇద్దరి మధ్య ఏర్పడే భావోద్వేగాల పరంపరే కాలా. స్టోరీ లైన్‌​ చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ మనుషులకు, మూగ జీవాలకు మధ్య ఉండే అనుబంధాన్ని రియలిస్టిక్‌ యాక్షన్‌తో కళ్లకు కట్టినట్లు చూపించారు.

టొవినో థామస్‌తో పాటు సుమేష్ మూర్, దివ్యా పిళ్ళై, లాల్ పాల్, ప్రమోద్ వెల్లియానంద్ కీలక పాత్రల్లో నటించిన ఈ క్రైమ్‌ త్రిల్లర్‌కు విఎస్‌ రోహిత్‌ దర్శకత్వం వహించాడు. టొవినో థామస్‌, విఎస్‌ రోహిత్‌, అఖిల్‌ జార్జ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా జూన్‌ 4న ఆహాలో రిలీజ్‌ కానుంది. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

చదవండి: In The Name of God : తొలిసారి ప్రియదర్శి అలా..

ముక్కలైన విమానం.. హాలీవుడ్ నటుడి దుర్మరణం

Advertisement
 
Advertisement
Advertisement