కాజల్‌ కల్యాణం? | Kajal Aggarwal marriage with Gutam | Sakshi
Sakshi News home page

కాజల్‌ కల్యాణం?

Aug 18 2020 1:28 AM | Updated on Aug 18 2020 3:33 AM

Kajal Aggarwal marriage with Gutam - Sakshi

ఇండస్ట్రీకి వచ్చి పుష్కరం దాటినా ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌గా వెలుగుతున్నారు కాజల్‌ అగర్వాల్‌. ‘లక్ష్మీ కల్యాణం’తో తెలుగు తెరకు పరిచయమయ్యారామె. ఇప్పుడు కాజల్‌ కల్యాణం ఖరారైనట్లు టాక్‌. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళుతున్న కాజల్‌ని ‘వృత్తిపరంగా బాగుంది.. మరి పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు సెటిల్‌ అవుతారు?’ అని అడిగినప్పుడల్లా ‘టైమ్‌ వచ్చినప్పుడు’ అని చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఆ టైమ్‌ రానే వచ్చిందని తెలుస్తోంది. తల్లిదండ్రులు చూసిన సంబంధానికి కాజల్‌ ‘యస్‌’ చెప్పారట. గౌతమ్‌ అనే వ్యాపారవేత్తతో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగిందని సమాచారం. ఇరుకుటుంబాల సమక్షంలో ఈ వేడుక జరిగిందట. గౌతమ్‌ బెంగళూరుకి చెందిన వ్యక్తి అని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement