ఓ లాయర్‌ పోరాటం | Kajal Aggarwal The India Story teaser explores impact of food adulteration in India | Sakshi
Sakshi News home page

ఓ లాయర్‌ పోరాటం

Jun 6 2026 1:40 AM | Updated on Jun 6 2026 1:40 AM

Kajal Aggarwal The India Story teaser explores impact of food adulteration in India

కాజల్‌ అగర్వాల్, శ్రేయాస్‌

వ్యవసాయంలో పురుగుల మందు వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న తీవ్ర ప్రభావాలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు చేతన్‌ డీకే రూపొందించిన సినిమా ‘ది ఇండియా స్టోరీ’. ‘స్లో పాయిజన్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌’ అన్నది ఈ సినిమా ఉపశీర్షిక. కాజల్‌ అగర్వాల్, శ్రేయాస్‌ తల్పాడే ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో చేతన్‌ సాగర్‌ బి. షిండే నిర్మించిన ఈ సినిమా జూలై 24న విడుదల కానుంది. 

శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘ప్రతి మూడు కుటుంబాల్లో ఒకరు క్యాన్సర్‌తో పోరాడుతున్నారు, ప్రతి అరవై సెకన్లకు ఒకరు లేదా ఇద్దరు చనిపోతున్నారు’’ అంటూ డైలాగ్స్‌ లేకుండా కొన్ని నంబర్స్‌ను ఈ టీజర్‌లో చూపించారు. వ్యవసాయరంగంలో జరుగుతున్న కల్తీ, ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడటం, వ్యవసాయ రంగంలో వినియోగించే మందుల తయారీలో ఆయా కంపెనీల నిర్లక్ష్యం వంటి అంశాలను ఈ సినిమాలో చర్చించినట్లుగా విడుదలైన టీజర్‌ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ లాయర్‌ పాత్రలో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement