Kajal Aggarwal Talk About Body Shaming Trolls During Pregnancy - Sakshi
Sakshi News home page

Kajal Aggarwal : 'ప్రెగ్నెన్సీ, బిడ్డ పుట్టాక మళ్లీ సినిమాలు చేయడంపై అలాంటి మాటలన్నారు'

May 18 2023 7:32 AM | Updated on May 18 2023 8:22 AM

Kajal Aggarwal About Body Shaming Trolls During Pregnancy - Sakshi

ఇతర హీరోయిన్లకు నటి కాజల్‌ అగర్వాల్‌కు కాస్త వ్యత్యాసం ఉంది. నటనను విపరీతంగా ప్రేమించే నటి ఈ బ్యూటీ. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కు ఆ తరువాత కోలీవుడ్‌కు పరిచయం అయిన కాజల్‌ ఈ మూడు భాషల్లోనూ నటిగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో స్టార్‌ హీరోలతో జత కట్టి స్టార్‌డమ్‌ను తెచ్చుకుంది.

అయితే అగ్రనటిగా రాణిస్తున్న సమయంలోనే ఎలాంటి హంగామా లేకుండా తను ప్రేమించిన వ్యక్తి గౌతమ్‌ కిచ్లును పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌తో కలిసి ఇండియన్‌– 2 చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా తెలుగులో బాలకృష్ణ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. చదవండి: చిన్నచిన్నవాటికే బాధపడేదాన్ని, అనుభవం చాలా నేర్పింది

ఇలాంటి పరిస్థితుల్లో తనపై వచ్చిన విమర్శలకు స్పందించిన కాజల్‌ అగర్వాల్‌ ఒక భేటీలో పేర్కొంటూ తాను కడుపుతో ఉన్నప్పుడు చాలా లావు అయ్యానంటూ కొందరు విమర్శించానని వాటిని తాను పట్టించుకోలేదని పేర్కొంది.

అలాగే బిడ్డకు జన్మనిచ్చిన కొద్ది రోజులకే నటించడానికి సిద్ధం కావడంపై కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకును ఉన్నతంగా తీర్చిదిద్ది గొప్ప తల్లిగా నిలిచి ఇలాంటి వారికి తగిన సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చదవండి: నేను కూడా యూత్‌ అనిపించింది: హీరో నాని

Advertisement
 
Advertisement
Advertisement