నాలుగేళ్ల లవ్‌కు బ్రేకప్‌.. సినిమాకు ఒప్పుకోరేమోనని టెన్షన్‌! | Kabir Khan Opens Up On Salman Khan, Katrina Kaif Break Up | Sakshi
Sakshi News home page

ఇద్దరూ విడిపోయారు.. కంఫర్ట్‌గా ఉండదని తెలిసినా కూడా హీరో ఇంటికి వెళ్లి..

Mar 30 2024 7:42 PM | Updated on Mar 30 2024 8:24 PM

Kabir Khan Opens Up On Salman Khan, Katrina Kaif Break Up - Sakshi

'కత్రినా, నాకు ఇంట్లో మనిషిలా అనిపిస్తుంది. సినిమా గురించి చెప్పగానే వెంటనే సంతకం చేసింది. తర్వాత సల్మాన్‌ ఖాన్‌ ఇంటికి వెళ్లాం. అసలే బ్రేకప్‌ అయింది. అలాం

ప్రేమలో ఉ‍న్నంతసేపు ఒకరిని విడిచి మరొకరు ఉండలేమంటారు. బ్రేకప్‌ అయ్యాక ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. కానీ ఇక్కడ చెప్పుకునే జంట మాత్రం చాలా ప్రొఫెషనల్‌. సినిమా కోసం పర్సనల్‌ విషయాలను పక్కనపెట్టి కలిసిపోయారు, కేవలం సెట్స్‌లోనే! సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ ఒకప్పుడు ప్రేమపక్షులన్న విషయం తెలిసిందే! అయితే సల్మాన్‌ ఎంతోమందితో ప్రేమాయణం నడిపాడు, కానీ ఏదీ సక్సెస్‌ కాలేదు. అలాగే కత్రినాతో నడిపిన ప్రేమ వ్యవహారం కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. కొంతకాలానికే ఇద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నారు.

అసౌకర్యంగా ఉంటుంది
అది జరిగిన కొంతకాలానికే డైరెక్టర్‌ కబీర్‌ ఖాన్‌ 'ఏక్‌ థా టైగర్‌' సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. కానీ ఈ లవ్‌ బర్డ్స్‌ బ్రేకప్‌ వల్ల ఇద్దరూ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటారో, లేదోనని తెగ టెన్షన్‌ పడ్డాడు. దాని గురించి అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కత్రినా, నాకు ఇంట్లో మనిషిలా అనిపిస్తుంది. సినిమా గురించి చెప్పగానే వెంటనే సంతకం చేసింది. తర్వాత సల్మాన్‌ ఖాన్‌ ఇంటికి వెళ్లాం. అసలే బ్రేకప్‌ అయింది. అలాంటి సమయంలో కలిసి పని చేయాలంటే ఎంతో అసౌకర్యంగా ఉంటుంది.

కత్రినా అని తెలిసి కూడా
ఆయన ఒప్పుకుంటాడో, లేదోనని టెన్షన్‌ పడుతూనే తన ఇంటికి వెళ్లాం. హీరోయిన్‌గా కత్రినాను సెలక్ట్‌ చేశాం అని చెప్పాను. 5-10 నిమిషాలు మౌనంగా ఉన్న తర్వాత సరే చేసేద్దాం అన్నారు. మా గుండె నుంచి పెద్ద భారం దిగిపోయినట్లనిపించింది' అని చెప్పుకొచ్చాడు. కాగా సల్మాన్‌- కత్రినా నాలుగేళ్లపాటు డేటింగ్‌ చేశారు. 2009లో విడిపోయారు. తర్వాత కత్రినా రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రేమలో పడింది. కానీ ఈ బంధం కూడా నిలవలేదు. వీళ్లిద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నాక విక్కీ కౌశల్‌ను లవ్‌ చేసింది. 2021లో వీరు పెళ్లి చేసుకున్నారు.

చదవండి: పదేళ్ల క్రితం ఆశపడ్డాడు.. చివరికి అది నెరవేరకుండానే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement