పెళ్లికి రెడీ అవుతోన్న‌ 'ప‌హిల్వాన్' విల‌న్ | Kabir Duhan Singh To Marry Girlfriend Dolly Sidhu In December | Sakshi
Sakshi News home page

ప్రేయ‌సిని పెళ్లాడ‌నున్న న‌టుడు

Jul 28 2020 8:05 PM | Updated on Jul 28 2020 8:05 PM

Kabir Duhan Singh To Marry Girlfriend Dolly Sidhu In December - Sakshi

తెలుగు, త‌మిళ న‌టుడు క‌బీర్ దుహాన్‌ సింగ్ ఇంట త్వ‌ర‌లోనే పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. గాయ‌ని డాలీ సిధుతో ఐదేళ్లుగా జ‌రుపుతున్న ప్రేమాయ‌ణానికి ఫుల్‌స్టాప్ పెట్టేసి పెళ్లి పీట‌లెక్క‌నున్నారు. గ‌తేడాది వీరిద్ద‌రికీ ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ్గా క‌రోనా కార‌ణంగా వివాహం వాయిదా ప‌డింది. అయితే వీరు ప‌రిస్థితులు అనుకూలిస్తే డిసెంబ‌ర్‌లో పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నారు. ఈ విష‌యాన్ని క‌బీర్ స్వ‌యంగా ఓ ఆంగ్ల మీడియాకు వెల్ల‌డించారు. అవును, ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ముహూర్తం పెట్టుకోవాల‌నుకుంటున్నామ‌ని తెలిపారు. అయితే అప్ప‌టి ప‌రిస్థితిని బ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. (నటి మూడో పెళ్లిపై విమర్శలు)

అప్ప‌టికీ క‌రోనా ఉధృతి ఉంటే ఆ స‌మ‌యంలో పెళ్లి వేడుక‌లు జ‌రుపుకోవ‌డం త‌న‌కు ఏమాత్రం ఇష్టం లేద‌న్నారు. అప్ప‌టివర‌కు ప‌రిస్థితులు అనుకూలిస్తే ముంబైలో పెళ్లి, ఢిల్లీలో రిసెప్ష‌న్ చేసుకోవాల‌ని భావిస్తున్నారు. కాగా క‌బీర్ దుహాన్ సింగ్ 'వేద‌ళం' సినిమాతో క్రేజ్ సంపాదించుకున్నారు. కిచ్చా సుదీప్ హీరోగా న‌టించిన 'ప‌హిల్వాన్'‌లో ప్ర‌తినాయ‌క పాత్ర‌లో మెప్పించారు. ఆయ‌న చివ‌రిసారిగా‌ 'యాక్ష‌న్' అనే త‌మిళ చిత్రంలో క‌నిపించారు. మ‌రోవైపు డాలీ సిధు పంజాబీ చిత్ర పరిశ్ర‌మ‌లో పాపుల‌ర్ సింగ‌ర్‌గా రాణిస్తున్నారు. (త్రిష పెళ్లి ఫిక్స్‌ అయ్యిందా..? )

Advertisement
 
Advertisement
Advertisement