ఏడాది ఆలస్యంగా... | Jurassic World: Dominion Delays Release to 2022 | Sakshi
Sakshi News home page

ఏడాది ఆలస్యంగా...

Oct 8 2020 12:44 AM | Updated on Oct 8 2020 12:44 AM

Jurassic World: Dominion Delays Release to 2022 - Sakshi

జురాసిక్‌ వరల్డ్‌ సిరీస్‌ కొన్నేళ్లుగా ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తూ వస్తోంది. ఈ డైనోజర్ల ప్రపంచంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జురాసిక్‌ వరల్డ్‌: డామినియన్‌’. యూనివర్శల్‌ పిక్చర్‌ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోలిన్‌ ట్రెవొరో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ముందుగా ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. తాజాగా ఈ సినిమాను జూన్‌ 10, 2022లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల వల్ల మా సినిమా విడుదల ఆలస్యం అయినప్పటికీ, దానికి తగ్గట్టుగానే మా చిత్రం ఉంటుంది. ప్రేక్షకులను రెండింతలు థ్రిల్‌ చేసేలా మా సినిమాని తీర్చిదిద్దుతున్నాం. అప్పటివరకూ అందరూ జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి’’ అన్నారు దర్శకుడు కోలిన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement