breaking news
Jurassic World movie
-
జురాసిక్ వరల్డ్.. పునర్జన్మలోనూ అదరగొట్టేసింది!
గతంలో సినీ ప్రియులను మెప్పించిన జురాసిక్ వరల్డ్ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. జురాసిక్ వరల్డ్: రీ బర్త్ పేరిట సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జూలై 2న రిలీజైన ఈ చిత్రం ఇండియాలోనే అరుదైన రికార్డ్ సాధించింది. దేశవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్ దాటేసింది. దీంతో ఈ ఏడాది జాబితాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన తొలి వారాంతంలోనే రికార్డ్ స్థాయిలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 49.3 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్, జోనాథన్ బెయిలీ, మహర్షలా అలీ కీలక పాత్రల్లో నటించారు.జురాసిక్ ప్రాంఛైజీలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాల్లో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతమైన రీతిలో ఆడియన్స్‌ను మెప్పించాయి. 2022లో వచ్చిన జురాసిక్ వరల్డ్: డొమినియన్కు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో 7వ సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌కు మొదటి రెండు భాగాలకు జురాసిక్ మూవీస్‌కు కథ అందించిన డేవిడ్ కోప్ స్టోరీ అందించారు. ఈ చిత్రానికి గరేత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. ఇక మార్వెల్ బ్యూటి బ్లాక్ విడో స్కార్లెట్ జాన్సన్ జురాసిక్ వరల్డ్ రీ బర్త్‌లో మెయిన్ లీడ్ రోల్లో కనిపించారు. -
ఏడాది ఆలస్యంగా...
జురాసిక్ వరల్డ్ సిరీస్ కొన్నేళ్లుగా ప్రేక్షకులను థ్రిల్ చేస్తూ వస్తోంది. ఈ డైనోజర్ల ప్రపంచంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జురాసిక్ వరల్డ్: డామినియన్’. యూనివర్శల్ పిక్చర్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోలిన్ ట్రెవొరో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ముందుగా ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. తాజాగా ఈ సినిమాను జూన్ 10, 2022లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల వల్ల మా సినిమా విడుదల ఆలస్యం అయినప్పటికీ, దానికి తగ్గట్టుగానే మా చిత్రం ఉంటుంది. ప్రేక్షకులను రెండింతలు థ్రిల్ చేసేలా మా సినిమాని తీర్చిదిద్దుతున్నాం. అప్పటివరకూ అందరూ జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి’’ అన్నారు దర్శకుడు కోలిన్. -
జురాసిక్.. ఫుల్ కిక్
ప్రస్తుతం హాలీవుడ్లో నిర్మాణంలో ఉన్న చిత్రాల్లో టాపిక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచినవాటిలో ‘జురాసిక్ వరల్డ్ 3’ ఒకటి. జురాసిక్ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి చిత్రం ‘జురాసిక్’ (1993)లో వెండితెరపై రాక్షస బల్లులు చేసిన వీర విహారానికి పిల్లలూ పెద్దలూ ఫిదా అయిపోయారు. దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ తెరకెక్కించిన ఈ ‘జురాసిక్ పార్క్’ ఎంత క్రేజ్ తెచ్చుకుందంటే.. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్స్‌ని కూడా ప్రేక్షకులు ఆసక్తిగా చూశారు. ఇప్పుడు ‘జురాసిక్ వరల్డ్ 3’పైనే అందరి దృష్టి ఉంది. కొందరు రచయితలతో కలిసి చిత్రదర్శకుడు కోలిన్ ట్రెవరో ఈ భాగానికి రాసిన స్క్రిప్ట్ అదిరిపోయే రేంజ్లో ఉందని కీలక పాత్రధారి క్రిస్ ప్రాట్ పేర్కొన్నారు. ‘‘గత ఏడాది విడుదలై, ఘనవిజయం సాధించిన ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’కి దీటుగా తాజా జురాసిక్ చిత్రం ఉంటుంది. జురాసిక్ ఫ్రాంచైజీలో వచ్చిన గత చిత్రాలకన్నా ఈ చిత్రకథ మరింత కిక్ ఇచ్చే విధంగా ఉంది. తొలి భాగంలో నటించిన స్యామ్ నీల్, లారా డెర్న్, జెఫ్ గోల్డ్‌బ్లమ్ కూడా ఈ చిత్రంలో నటిస్తారు. భారీ స్థాయిలో రాబోతున్న చిత్రం ఇది. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు క్రిస్ ప్రాట్. వచ్చే ఏడాది జూన్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. -
‘జురాసిక్ వరల్డ్ 3’ ప్లాన్ రెడీ!
స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్షన్లో మొన్న డిసెంబర్లో ‘ది పోస్ట్’ అని ఒక సినిమా వచ్చింది గుర్తుంది కదా? ఇప్పుడు నిన్నగాక మొన్న ‘రెడీ ప్లేయర్ వన్’ అని ఇంకో సినిమా వచ్చింది. ఇవి కాకుండా ఆయన ప్రొడక్షన్లో నిరంతరం ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. అంత బిజీగా ఉంటాడాయన. ఇక ‘జురాసిక్ పార్క్’తో డైనోసర్ సినిమా అంటే స్పీల్బర్గ్ అనిపించుకున్న ఆయన, ‘జురాసిక్ వరల్డ్’ సిరీస్‌కు దర్శకుడిగా కాక, నిర్మాతల్లో ఒకరుగా ఉంటూ వస్తున్నాడు. జురాసిక్ వరల్డ్ ఒకటో భాగం 2015లో వస్తే, రెండో భాగం 2018 జూన్‌లో వస్తోంది. అలాగే మూడో భాగానికి కూడా అప్పుడే ప్లాన్ రెడీ చేసేశాడు స్పీల్బర్గ్. ఆయన ఒక నిర్మాతగా నిర్మించనున్న జురాసిక్ వరల్డ్ మూడో భాగానికి కొలిన్ ట్రెవెరో దర్శకత్వం వహించనున్నాడు. జురాసిక్ వరల్డ్ మొదటి భాగానికి ఆయనే దర్శకుడు కాగా, కొన్ని అనుకోని కారణాల వల్ల రెండో భాగానికి జె.ఎ.బయోనా దర్శకత్వం వహించాడు. ఇప్పుడు మూడో భాగానికి మళ్లీ కొలినే దర్శకుడు కావడం విశేషం. -
స్పీల్బర్గ్ దర్శకత్వంలో?
ది వారియర్, ఎ మైటీ హార్ట్, ది నేమ్‌సేక్, ది అమేజింగ్ స్పైడర్మాన్, లైఫ్ ఆఫ్ పై... ఇలా పలు హాలీవుడ్ చిత్రాల్లో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటించారు. త్వరలో విడుదల కానున్న ‘జురాసిక్ వరల్డ్’ చిత్రంలో కూడా ఇర్ఫాన్ కీలక పాత్ర చేశారు. ఇది ‘జురాసిక్ పార్క్’కి నాలుగో సీక్వెల్. తొలి భాగానికి దర్శకత్వం వహించిన స్పీల్బర్గ్ ఈ సీక్వెల్‌కి మాత్రం ఓ నిర్మాతగా వ్యవహరించారు. త్వరలో మరో చిత్రం చేయడానికి స్పీల్బర్గ్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తారా? లేక నిర్మిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ రెండు బాధ్యతల్లో ఏది నిర్వహించినా.. ఈ చిత్రంలో మాత్రం ఇర్ఫాన్‌ఖాన్‌తో ఓ కీలక పాత్ర చేయించాలని స్పీల్బర్గ్ అనుకుంటున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఇర్ఫానే తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తానని ఇర్ఫాన్ చెప్పారు.