స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో? | Irrfan Khan to play villain in The Amazing Spider-Man 3? | Sakshi
Sakshi News home page

స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో?

Nov 29 2014 1:05 AM | Updated on Aug 17 2018 2:34 PM

స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో? - Sakshi

స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో?

ది వారియర్, ఎ మైటీ హార్ట్, ది నేమ్‌సేక్, ది అమేజింగ్ స్పైడర్‌మాన్, లైఫ్ ఆఫ్ పై... ఇలా పలు హాలీవుడ్ చిత్రాల్లో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటించారు.

ది వారియర్, ఎ మైటీ హార్ట్, ది నేమ్‌సేక్, ది అమేజింగ్ స్పైడర్‌మాన్, లైఫ్ ఆఫ్ పై... ఇలా పలు హాలీవుడ్ చిత్రాల్లో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటించారు. త్వరలో విడుదల కానున్న ‘జురాసిక్ వరల్డ్’ చిత్రంలో కూడా ఇర్ఫాన్ కీలక పాత్ర చేశారు. ఇది ‘జురాసిక్ పార్క్’కి నాలుగో సీక్వెల్. తొలి భాగానికి దర్శకత్వం వహించిన స్పీల్‌బర్గ్ ఈ సీక్వెల్‌కి మాత్రం ఓ నిర్మాతగా వ్యవహరించారు. త్వరలో మరో చిత్రం చేయడానికి స్పీల్‌బర్గ్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తారా? లేక నిర్మిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ రెండు బాధ్యతల్లో ఏది నిర్వహించినా.. ఈ చిత్రంలో మాత్రం ఇర్ఫాన్‌ఖాన్‌తో ఓ కీలక పాత్ర చేయించాలని స్పీల్‌బర్గ్ అనుకుంటున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఇర్ఫానే తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తానని ఇర్ఫాన్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement