యంగ్ టైగర్ మూవీ బిగ్ అప్‌ డేట్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్ | Sakshi
Sakshi News home page

NTR 30: ప్రీ ప్రొడక్షన్ పనుల్లో 'ఎన్టీఆర్ 30'.. సోషల్ మీడియాలో వైరల్

Published Sun, Nov 6 2022 9:16 PM

Junior NTR Movie NTR30 Pre Production Works Goes Viral - Sakshi

టాలీవుడ్​ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'ఎన్టీఆర్ 30'. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించి మేకర్స్ ట్వీట్ చేశారు. 

(చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్.. త్వరలోనే ప్రారంభం..!)

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ తెగ వైరలవుతోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు కొరటాల శివ.. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సబు సిరిల్ కలిసి చర్చిస్తున్నట్లుగా ఫోటోలు ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ నెలలోనే సినిమాను లాంచ్​ చేసి.. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

 'ఆర్ఆర్ఆర్' తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఒక్క సినిమాలో నటించలేదు. తాజాగా ఆయన కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన సినిమాలు చేయనున్నారు. కొరటాల సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ తన లుక్ సైతం మార్చుకున్నారు. అయితే గతంలో కొరటాల-ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందని  సోషల్ మీడియాలో వైరలైంది.

ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ 'ఆచార్య'తో డిజాస్టర్ అందుకున్నారు. అందుకే ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందువల్లే సినిమా ఆలస్యమవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామను ఎంపిక చేయాలనుకుంటున్నట్లు టాక్.

Advertisement
 
Advertisement
 
Advertisement