పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించిన ఎన్టీఆర్‌‌

Jr NTR Respond On His Political Entry In a Press Meet - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌‌ రాజకీయ రంగ ప్రవేశం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. తదుపరి ఎన్నికల నాటికి ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు దీనిపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాగా ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ త్వరలో జెమిని టీవీలో ప్రసారం కానుంది. ఈ షోకు సంబంధంచిన ప్రోమోను జెమిని టీవీ తాజాగా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌తో శుక్రవారం ప్రెస్‌మీట్‌ జరిగిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించారు. ‘మీ పోలిటికల్‌ ఎంట్రీ ఎప్పడు’అని ఓ విలేక‌రి అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్‌ తనదైన శైలిలో స్పందించారు. ‘దీనికి మీరే సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నకు నేను ఏ సమాధానం చెబుతానో కూడా మీకు తెలుసు’ అంటూ ప్రశ్న దాటేశారు. అయితే రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఇది సమయం, సందర్భం కాదని, దీని గురించి మరొసారి తీరిగ్గా కాఫీ తాగుతూ చర్చించుకుందామంటూ సమాధానం ఇచ్చారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌ దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన కొమురం భీం పాత్ర‌లో కనిపించనున్నాడు. 

చదువండి: 
ఆట నాది.. కోటి మీది అంటున్న ఎన్టీఆర్‌
ఆర్‌ఆర్‌ఆర్‌: క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్‌!

కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? ఇది మీ కోసమే..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top