ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న యాక్షన్ మూవీ ‘డ్రాగన్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అక్టోబర్‌లోనే మొదలు కానుందని తెలుస్తోంది. ఎన్టీఆర్–షాహిద్‌ల మధ్య సన్నివేశాలను చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల డ్రాగన్ వాయిదా పడుతుందనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే నిర్మాత యలమంచిలి రవిశంకర్ స్పందించారు.
ఇటీవల ఓ మూవీ ప్రీ రిలీజ్‌కు ఈవెంట్‌కు హాజరైన ఆయన ఎన్టీఆర్ డ్రాగన్ మూవీపై మాట్లాడారు. ఈ సినిమా అనుకున్న టైమ్‌కు రిలీజ్ కానుందని ప్రకటించారు. డ్రాగన్ విడుదలలో ఎలాంటి ఆలస్యం జరగదని క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ కానుంది. మొదటి ఈ మూవీని జూన్ 25 రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ మళ్లీ ముందే విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.


