దేవర తాండవం.. ఫుల్ వీడియో అదిరిపోయిందిగా! | Jr Ntr Devara Part 1 Thandavam Full Video Song Out Now | Sakshi
Sakshi News home page

Devara part 1: దేవర తాండవం.. ఫుల్ వీడియో అదిరిపోయిందిగా!

Nov 7 2024 6:29 PM | Updated on Nov 7 2024 6:54 PM

Jr Ntr Devara Part 1 Thandavam Full Video Song Out Now

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్‌ చిత్రం దేవర పార్ట్-2. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇ‍చ్చింది. సముద్రం బ్యాప్‌డ్రాప్‌లో వచ్చిన దేవర బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

తాజాగా ఈ మూవీ నుంచి దేవర తాండవం అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో ఎన్టీఆర్‌ తన స్టెప్పులతో అదరగొట్టారు. జూనియర్ ఫ్యాన్స్‌ ఈ ఫుల్‌ వీడియో సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయండి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ విలన్ పాత్రలో కనిపించారు. దేవరలో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.

ఓటీటీకి దేవర

నవంబర్ 8 నుంచే దేవర ఓటీటీలో సందడి చేయనుంది. ఇప్పటికే స్ట్రీమింగ్‌ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం దక్షిణాది భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్ చేయనుంది. త్వరలోనే బాలీవుడ్ ‍ప్రేక్షకులకు సైతం దేవరను అందుబాటులోకి తీసుకురానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement