ప్రశాంత్‌ నీల్‌ ఇంట్లో జూ ఎన్టీఆర్‌, రిషబ్‌ శెట్టి.. కారణం ఇదే | Jr NTR And Rishab Shetty Meet In Prashanth Neel Home, Pics Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

ప్రశాంత్‌ నీల్‌ ఇంట్లో జూ ఎన్టీఆర్‌, రిషబ్‌ శెట్టి.. కారణం ఇదే

Published Sat, Mar 2 2024 9:31 AM

JR NTR And Rishab Shetty Meet In Prashanth Neel Home - Sakshi

సౌత్‌ ఇండియా టాప్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా కలిశారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో కనిపించిన తారక్‌.. దేవర షూట్‌ కోసం ఎక్కడికైనా వెళ్తున్నారా అని అనుకున్నారు అందరూ.. కానీ ప్రశాంత్‌ నీల్‌ ఇంట్లో మార్చి 1న ఏదో శుభకార్యం ఉండగా తన సతీమణితో కలిసి ఆయన అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. వారితో పాటుగా మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేత యలమంచిలి రవి శంకర్‌ కూడా ఉన్నారు. 

ప్రశాంత్‌ నీల్‌ ఇంట్లో సందడి చేసిన జూ ఎన్టీఆర్‌ ఫ్యామిలీ (ఫోటోలు)
ప్రశాంత్‌ నీల్‌ ఇంట్లో జరుగుతున్న ఒక కార్యక్రమానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ తన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటుగా వెళ్లారు. అదే కార్యక్రమానికి 'కాంతార' హీరో రిషబ్‌ శెట్టి కూడా తన సతీమణి ప్రగతితో రావడం జరిగింది. అక్కడ వారందరూ కలిసి దిగిన గ్రూప్‌ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. తారక్‌తో రిషబ్‌ శెట్టి ఫ్యామిలీ ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం కనిపిస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. 'కాంతారా', 'కేజీఎఫ్‌' సిరీస్‌లను హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించింది. అలా ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పుడు ఈ ముగ్గురిని ఒకే ఫ్రేమ్‌లో చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు.  ఫోటోపై అభిమానులు భారీగా లైకులతో క్లిక్‌ చేస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌- జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో రిషబ్ శెట్టి కూడా నటించనున్నారా అనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement