ట్రైలర్‌ అదిరిపోయింది | Sakshi
Sakshi News home page

ట్రైలర్‌ అదిరిపోయింది

Published Mon, Nov 6 2023 1:59 AM

Jigarthanda Double X release date locked - Sakshi

‘‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’ సినిమా ట్రైలర్‌ అదిరిపోయింది. కార్తీక్‌ సుబ్బరాజ్‌ టేకింగ్‌ ఎలా ఉంటుందో మరోసారి ఈ ట్రైలర్‌తో చూపించాడు. సినిమా తప్పకుండా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందనే గట్టి నమ్మకం ఉంది’’ అని హీరో వెంకటేశ్‌ అన్నారు. రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’. కార్తికేయన్‌ సంతానం నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదలఅవుతోంది.

హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్‌ మాట్లాడుతూ–‘‘లారెన్స్, ఎస్‌జే సూర్య వంటి ప్రతిభ ఉన్న నటులు ఈ సినిమాలో నటించారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ కల్ట్‌ డైరెక్టర్‌. నాకోసం తను త్వరలోనే ఓ స్క్రిప్ట్‌ తయారు చేస్తాడనుకుంటున్నాను’’ అన్నారు. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ–‘‘తమిళనాడులో నేను ట్రస్ట్‌ పెట్టి సేవలు చేస్తున్నాను. ఇకపై తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ ట్రస్ట్‌ సేవలు అందించబోతున్నాను’’ అన్నారు.

‘‘అందరూ మా సినిమాను చూసి ఎంజాయ్‌ చే స్తారు’’ అన్నారు ఎస్‌జే సూర్య. ‘‘మా చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అని కార్తికేయన్‌ సంతానం అన్నారు. ‘‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’ నాకు ఎంతో ప్రత్యేకం. నాలుగున్నరేళ్ల తర్వాత థియేటర్స్‌లోకి విడుదలవుతున్న నా సినిమా ఇది’’ అన్నారు కార్తీక్‌ సుబ్బరాజ్‌. ఈ వేడుకలో సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్, డైరెక్టర్‌ శైలేష్‌ కొలను, నటుడు నవీన్‌ చంద్ర మాట్లాడారు. 

Advertisement
 
Advertisement