డేట్‌ చేంజ్‌ | jeeva and arjun sarja agatya release date postponed | Sakshi
Sakshi News home page

డేట్‌ చేంజ్‌

Jan 31 2025 3:55 AM | Updated on Jan 31 2025 5:12 AM

jeeva and arjun sarja agatya release date postponed

జీవా(jeeva), అర్జున్‌ సర్జా(arjun sarja) హీరోలుగా, రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘అగత్యా’(agatya). ప్రముఖ పాటల రచయిత పా. విజయ్‌ కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి గణేశ్‌ నిర్మించిన ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నేడు విడుదల కావాల్సింది.

అయితే జనవరి 31 నుంచి ఫిబ్రవరి 28కి విడుదలని వాయిదా వేసినట్లు ప్రకటించారు మేకర్స్‌. ‘‘గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘అగత్యా’. మన సంస్కృతి, అనుబంధాలను దర్శకుడు బలంగా చెప్పారు. అద్భుతమైన సీజీ వర్క్‌తో భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. వీఎఫ్‌ఎక్స్‌ కోసం మరికొంత టైమ్‌ కేటాయించాలని భావించి, విడుదల వాయిదా వేశాం’’ అని యూనిట్‌ పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement