చావు నుంచి కాపాడినందుకు థ్యాంక్స్‌ | Jayashree Ramaiah Thanks Kiccha Sudeep For Saving Her | Sakshi
Sakshi News home page

ఒత్తిడిని ఎదుర్కోలేక చావును కోరాను

Jul 26 2020 12:56 PM | Updated on Jul 26 2020 2:39 PM

Jayashree Ramaiah Thanks Kiccha Sudeep For Saving Her - Sakshi

ప్ర‌పంచానికి, డిప్రెష‌న్‌కు గుడ్‌బై.. అంటూ శాశ్వ‌త‌ వీడ్కోలు ప‌లికి, మ‌రికాసేప‌టికే తాను బాగున్నానంటూ వివ‌ర‌ణ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ, క‌న్న‌డ న‌టి జ‌య‌శ్రీ రామ‌య్య అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఆమె తాజాగా ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చారు. ఈ సంద‌ర్భంగా తాను అలా ఎందుకు మాట్లాడారో చెప్పుకొచ్చారు. ఒత్తిడిని జ‌యించ‌లేకే చావును కోరుకున్నానని పేర్కొన్నారు. అయితే అలాంటి క్లిష్ట స‌మ‌యంలో త‌న బాగోగులు చూసుకుంటూ, త‌నను చావు నుంచి కాపాడిన‌ న‌టుడు కిచ్చా సుదీప్‌, అత‌ని టీమ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. (ప్రపంచానికి, డిప్రెషన్‌కు గుడ్‌బై: నటి)

అలాగే అభిమానులను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేసినందుకు క్ష‌మాప‌ణ‌లు తెలిపారు. ఒత్తిడికి గ‌ల కార‌ణాలు మాత్రం చెప్ప‌లేదు. కాగా ఈ నెల 22న‌ జ‌య‌శ్రీ "నేను వెళ్లిపోతున్నా.. ప్ర‌పంచానికి, ఒత్తిడికి గుడ్‌బై" అంటూ పోస్ట్ పెట్టారు. అనంత‌రం కాసేప‌టికే దాన్ని తొల‌గించారు. అయితే అప్ప‌టికే అభిమానులు ఆమెకు ధైర్యం నూరిపోస్తూ కామెంట్ల వ‌ర్షం కురిపించారు. దీంతో ఆమె బాగానే ఉన్నాన‌ని స్ప‌ష్టం చేయ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆస్తి కోసం మేన‌మామ శారీర‌కంగా, మాన‌సికంగా వేధిస్తున్నాడంటూ గ‌తేడాది ఆమె పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసి వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే (మేనమామ వేధిస్తున్నాడు)

Advertisement
 
Advertisement
Advertisement