నవ్వుల జాతర 

Jandhyala Gari Jatara 2. 0  Kick starts With Grand Pooja Ceremony - Sakshi

క్రిష్‌ సిద్ధిపల్లి, కష్వీ జంటగా ‘జంధ్యాలగారి జాతర 2.0’ సినిమా షురూ అయింది. వాల్మీకి దర్శకత్వంలో శ్రీ నిధి క్రియేషన్స్‌ సమర్పణలో సన్‌ స్టూడియో బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

వాల్మీకి మాట్లాడుతూ– ‘‘పూర్తి హాస్యభరిత చిత్రంగా ‘జంధ్యాలగారి జాతర 2.0’ ఉంటుంది. ఈ సినిమాకు జంధ్యాలగారి పేరు పెట్టడంతో మంచి అంచనాలుంటాయి. ఆ అంచనాలను అందుకునేలా మా చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘విందు భోజనం లాంటి చిత్రమిది’’ అన్నారు క్రిష్‌ సిద్ధిపల్లి. నటులు రఘుబాబు, పృథ్వీ, యాని మాస్టర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వంశీ కృష్ణ, కెమెరా: విజయ్‌ ఠాగూర్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top