Idris Elba As James Bond: నెక్ట్స్​ జేమ్స్​ బాండ్​ అతడేనా !.. మేకర్స్​ ఏమంటున్నారంటే ?

James Bond Producers On Idris Elba As Next James Bond - Sakshi

జేమ్స్​ బాండ్​గా డేనియల్​ క్రేగ్​ నటించిన చివరి బాండ్​ చిత్రం 'నో టైమ్​ టు డై'. ఈ సిరీస్​లో 25వ బాండ్ చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో ఏజెంట్​ బాండ్ చనిపోవడంతోపాటు చక్కని భావోద్వేగపు వీడ్కోలు ఇచ్చారు మేకర్స్​. అయితే డేనియల్​ తర్వాత జేమ్స్​ బాండ్​గా సందడి చేయనుంది ఎవరా అనే అంశం ఆసక్తిగా మారింది. అనేక మంది హాలీవుడ్​ స్టార్స్​ సైతం ఆ పాత్రను చేయాలని ఉత్సుకతతో ఉన్నారు. ఈ క్రమంలో తర్వాతి జేమ్స్​ బాండ్​గా 'మండేలా: లాంగ్​ వాక్ టు ఫ్రీడమ్' యాక్టర్​ 'ఇడిస్​ ఎల్బా' (Idris Elba) నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ​

ఈ విషయంపై జేమ్స్​ బాండ్​ ఫ్రాంచైజీ నిర్మాతలు బార్బరా బ్రోకలీ, మైఖేల్​ జీ విల్సన్​లు స్పందించారు. స్క్రీన్​రాంట్​కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాతలు ఇలా చెప్పుకొచ్చారు. 'మాకు ఇడిస్ చాలా బాగా తెలుసు. మాకు అతను మంచి స్నేహితుడు. అలాగే అద్భుతమైన నటుడు. కానీ జేమ్స్​ బాండ్ గురించి ఇలా మాట్లాడటం ఎప్పుడూ కష్టమే. మీకు తెలుసా. నో టైమ్ టు డై సినిమా విడుదల వరకు డేనియల్​నే బాండ్​గా నిర్ణయించుకున్నాం. అలాగే అతను బాండ్​గా ఎంతగా అలరించాడో చూశాం. తర్వాత బాండ్​ గురించి మేము ఇంకా ఎవరి గురించి ఆలోచించలేదు. ఎవరితో మాట్లాడలేదు.'

గతేడాదే తదుపరి జేమ్స్​ బాండ్​ తానే అనే పుకార్లకు చెక్ పెట్టాడు ఇడిస్​. లండన్​లో ఒక సంభాషణల మధ్య 'కాదు. నేను జేమ్స్ బాండ్​ను కాను. మార్పును కోరుకున్నట్లయితే నలుపు, తెలుగు వంటి వర్ణం గురించి మాట్లాడనప్పుడే ఆ పాత్ర చేస్తాను.' అని ఇడిస్​ తెలిపాడు. అయితే ఈ తర్వాతి బాండ్​ కోసం నాన్‌-బ్రిటిష్‌ ఆర్టిస్ట్‌,  బ్లాక్‌ ఆర్టిస్ట్‌ను తీసుకోనుట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో ఇడిస్​ అలా మాట్లాడి ఉండోచ్చని తెలుస్తోంది. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top