జై భీమ్‌ చిత్రానికి మరో అరుదైన గౌరవం | Jai Bhim And RRR In Indian Panorama Line Up At IFF | Sakshi
Sakshi News home page

Jai Bhim Movie: జై భీమ్‌ చిత్రానికి మరో అరుదైన గౌరవం

Published Sun, Oct 23 2022 8:36 AM | Last Updated on Sun, Oct 23 2022 10:14 AM

Jai Bhim And RRR In Indian Panorama Line Up At IFF - Sakshi

తమిళసినిమా: నటుడు సర్య కథానాయకుడిగా నటించి నిర్మించిన సూరరై పోట్రు, జై భీమ్‌ చిత్రాలు ప్రేక్షకుల ఆదరణను, విమర్శకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. సూరరై పోట్రు చిత్రం సూర్యకు తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును తెచ్చిపెట్టింది. ఇక జై భీమ్‌ 94వ అకాడమీ అవార్డుతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. తాజాగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుందీ చిత్రం.

ఈ సినిమాను సౌత్‌ ఇండియన్‌ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి వెల్లడించారు. నవంబర్‌ 20 నుం 28 వరకు గోవాలో ఈ చిత్రోత్సవాలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రోత్సవాల్లో మొత్తం 45 చిత్రాలను ప్రదర్శించనున్నారు. అందులో 20 లఘు చిత్రాలు, 25 కమర్షియల్‌ చిత్రాలకు చోటు లభించాయి.

అందులో సూర్య కథానాయకుడిగా నటించిన జై భీమ్‌ ఒకటి. ఈ చిత్రాన్ని నటుడు సూర్య, జ్యోతిక తమ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మించారు. ఇందులో సూర్య న్యాయమూర్తి కే.చంద్రు పాత్రలో నటించారు. గత ఏడాది నవంబర్‌ నెలలో అమేజాన్‌ ప్రైమ్‌ టైమ్‌లో విడుదలై విశేష ఆదరణను పొందింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement