వ్యాపారవేత్తతో స్టార్‌ హీరోయిన్‌ సహజీవనం!

Jacqueline Fernandez Shifting To New House With Her Boyfriend In Juhu - Sakshi

Jacqueline Fernandez: వరుస సినిమాలతో ఫుల్‌ బిజీ అయింది సాహో బ్యూటీ ‘జాక్వెలిన్ ఫెర్నాండేజ్’. ‘సాహో’లో స్పెషల్‌ సాంగ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా ఈ శ్రీలంకన్ లేడీ.. రీసెంట్‌గా మరో టాలీవుడ్‌ మూవీకి సైన్‌ చేసింది. పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌ హీరోగా దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటించనుంది. త్వరలోనే ఆమె ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు జాక్వెలిన్ పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించిన ఓ వార్త బీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ శ్రీలంక భామ ఓ ఇండియన్‌తో ప్రేమలో పడిందట. సౌత్‌ ఇండియాకి చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమె రిలేషనల్‌ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారని వినికిడి. ఈ భామ ఇటీవల ముంబైలోని ఖరీదైన జుహు ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ కొనిదంట. అందులోనే బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉంటుందని సమాచారం. బాలీవుడ్‌ భామలకు పెళ్లికి ముందు ప్రియుడితో సహజీవనం కామన్‌. ఇప్పుడు ఆ లిస్ట్‌లో జాక్వెలిన్‌ కూడా చేరింది. మరి ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కుతుందో లేదో చూడాలి. 


చదవండి:
భార్యకు నటుడి సర్‌ప్రైజ్‌; థాంక్యూ అంటూ భావోద్వేగం
డేటింగ్‌ గురించి చెప్పేందుకు ఇదా సరైన సమయం?!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top