ఆ హీరో దుస్తులకు దూరం

Jackie Shroff Did Not Need Costume Designing In OK Computer - Sakshi

హీరోగా, విలన్‌గా జాకీ ష్రాఫ్‌కి హిందీలో మంచి గుర్తింపు ఉంది. అప్పుడప్పుడూ ఇతర భాషల్లోనూ నటిస్తుంటారు. ప్రస్తుతం ‘ఓకే కంప్యూటర్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారాయన. ఇందులో ఆయన పాత్ర పేరు పుష్పక్‌. ఈ సిరీస్‌ ట్రైలర్‌లో దుస్తులు లేకుండా చెట్లు, పొదల చాటున దాక్కుని కనబడతారు జాకీ. నాకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అవసరం లేదంటున్నారాయన. ‘ఓకే కంప్యూటర్‌’ గురించి జాకీ మాట్లాడుతూ – ‘‘ఇందులో సాంకేతికతను, సైన్స్‌ని వ్యతిరేకించే వ్యక్తిగా నటిస్తున్నాను. టెక్నాలజీతో పాటు యువతరం పర్యావరణానికి ప్రాధాన్యం ఇవ్వాలని నా పాత్ర చెబుతుంటుంది. ఈ పాత్రకు తగ్గట్టుగా రాలిపోయిన ఆకులు, పువ్వులను నా శరీరానికి కప్పుకుంటాను. అందుకే కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అవసరం లేదన్నాను’’ అని చెప్పారు.

చదవండి: శ్రీముఖిలో ఈ టాలెంట్‌ కూడా ఉందా!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top