నిక్కీని ముద్దు పెట్టుకోలేదు: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

Jaan Kumar Sanu: I Did Not Kiss Nikki Tamboli - Sakshi

హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు నిక్కీ తంబోళి, జాన్‌ కుమార్‌ సాను క్లోజ్‌గా మూవ్‌ అవడంతో వారి మధ్య ఏదో నడుస్తుందంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. వీళ్లిద్దరి బంధానికి బ్రేక్‌ వేస్తూ నవంబర్‌లో జాన్‌ బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడగా నెల తిరిగేలోగా నిక్కీ కూడా ఎలిమినేట్‌ అయింది. కానీ బయటికి వచ్చిన తర్వాత వీరి వ్యవహారం తలకిందులైంది. తనకు ఇష్టం లేకపోయినా జాన్‌ తనను ముద్దు పెట్టుకున్నాడంటూ ఆరోపణలు గుప్పించింది నిక్కీ. దీన్ని జాన్‌ కుమార్‌ సాను తీవ్రంగా ఖండించాడు. తాజా ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ఆమెను ముద్దు పెట్టుకోలేదని స్పష్టం చేశాడు. నిక్కీ నోటికొచ్చినట్లు మాట్లాడుతుందని విమర్శించాడు. అలాగే ఆమెను ఆకర్షించేందుకు ఎప్పుడూ తాపత్రయపడలేదని, అసలు ప్రేమించడం లేదని స్పష్టం చేశాడు. కాకపోతే బిగ్‌బాస్‌ హౌస్‌లో కలిసి సాగడం వల్ల నిక్కీ, తాను ఒకరికొకరం దగ్గరయ్యామని తెలిపాడు. (చదవండి: నాన్న అందరికీ సహాయం చేసేవారట..)

ఆ మధ్య నిక్కీ తల్లి మాట్లాడుతూ.. "నా కూతురికి ఇష్టం లేకపోయినా జాన్‌ ఆమె వెంటే తిరిగి ఇబ్బంది పెట్టాడు. అతడిని అన్నయ్యా అని పిలిచినా వినిపించుకోలేదు. అందుకే ఆమె ప్రతిసారి నువ్వు నా ఫ్రెండ్‌ మాత్రమే అన్నట్లుగా మాట్లాడేది" అని పేర్కొంది. దీనిపై జాన్‌ తల్లి స్పందిస్తూ.. "నిక్కీ, జాన్‌ మంచి స్నేహితులుగా ఉండాలనుకుంటున్నారు. కానీ నిక్కీ సడన్‌గా నా కొడుకు గురించి అలా మాట్లాడటం ఏమీ బాగోలేదు. షో కోసం ఆమె అలా ఏది పడితే అది మాట్లాడటం అంత మంచిది కాదు. ఆమె వ్యాఖ్యలను అభిమానులు కూడా అంగీకరించలేకపోయారు" అని చెప్పుకొచ్చింది. (చదవండి: అతడితో ప్రేమలో ఉన్నాను: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top