లవ్‌ టుడే హీరోయిన్‌ కొత్త సినిమా.. పోస్టర్‌ చూశారా? | Sakshi
Sakshi News home page

Ivana: థ్రిల్లర్‌ జానర్‌లో మూవీ చేస్తున్న లవ్‌ టుడే బ్యూటీ.. పోస‍్టర్‌ రిలీజ్‌

Published Mon, Dec 11 2023 12:19 PM

Ivana, Venkat Senguttuvan Starrer Mathimaran Movie Poster Out - Sakshi

జీఎస్‌ సినిమా ఇంటర్నేషనల్‌ పతాకంపై మంద్ర వీరపాండియన్‌ దర్శకత్వం వహించిన చిత్రం మదిమారన్‌. ఈయన ప్రముఖ దర్శకుడు బాల శిష్యుడు. హీరో వెంకట్‌ సెంగుట్టవన్‌, లవ్‌ టుడే హీరోయిన్‌ ఇవానా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు. థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా గురించి చిత్రయూనిట్‌ మాట్లాడుతూ.. డోంట్‌ జడ్జ్‌ ఎ బుక్‌ బై ఇట్స్‌ కవర్‌ (పుస్తకం కవర్‌ పేజ్‌ను చూసి దానికి వెల కట్టకూడదు) అనే సామెతను నేపథ్యంగా తీసుకుని రూపొందిస్తున్న కథా చిత్రం ఇదని పేర్కొంది. తనతో పాటు పుట్టిన (కవల పిల్లలుగా) సహోదరి కోసం వెతికే హీరో ఇతివృత్తమే ఈ చిత్రం అని తెలిపింది.

ఈ సినిమా ప్రేక్షకులకు వినూత్న అనుభవాన్ని కలిగిస్తుందని నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. నటి ఆరాధ్య, ఎంఎస్‌ భాస్కర్‌, ఆరుగళం నరేన్‌, బాబా చెల్లదురై, ప్రవీణ్‌కుమార్‌, సుదర్శన్‌, గోవింద్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే చిత్ర ట్రైలర్‌ను, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్‌ సభ్యులు తెలిపారు. కాగా మదిమారన్‌ సినిమా తమిళనాడు విడుదల హక్కులను బాబిన్స్‌ స్టూడియోస్‌ సంస్థ చేజిక్కించుకున్నట్లు చెప్పారు. ఈ మూవీకి కార్తీక్‌ రాజా సంగీతాన్ని, ప్రవేశ్‌, కె ఛాయాగ్రహణం అందించారు.

చదవండి: రూ. 2 వేల కోట్లకు పైగా మోసం కేసులో సినీ నటుడు

Advertisement
 
Advertisement
 
Advertisement