శ్రీలీల గురించి ఈ విషయాలు తెలుసా? | Interesting Facts About Sreeleela | Sakshi
Sakshi News home page

రానా, అనిల్‌ రావిపూడితో బంధుత్వం.. శ్రీలీల గురించి ఈ విషయాలు తెలుసా?

Mar 16 2025 9:25 AM | Updated on Mar 16 2025 9:49 AM

Interesting Facts About Sreeleela

👉: చాలా ఏళ్ళ క్రితం ఏ హీరోయిన్‌ని అడిగినా, ‘డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ని అయ్యాను’ అని చెప్పేవారు. ఇప్పటి పాపులర్‌ హీరోయిన్లలో చాలామంది డాక్టర్లే! సాయి పల్లవి , మీనాక్షి చౌదరి , శ్రీ లీల.. తన తల్లి స్వర్ణలత గైనకాలజిస్ట్‌ కావడంతో డాక్టర్‌ కావాలనుకున్నానని శ్రీ లీల చెప్పింది.  విజయవాడ మూలాలు ఉన్నా, పుట్టింది అమెరికాలో, పెరిగింది బెంగళూరులో.


👉: కేజీఎఫ్‌ సినిమాతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన యశ్‌– శ్రీలీలకి ఫ్యామిలీ ఫ్రెండ్‌. యశ్‌ భార్య రాధికా పండిట్‌కి డెలివరీ చేసిన డాక్టర్‌ శ్రీ లీల వాళ్ళ తల్లే! అలా రెండు కుటుంబాలకి పరిచయం!


👉: యశ్‌ని సూపర్‌ స్టార్‌ చేసిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ బావ మురళితో కన్నడంలో ఓ సినిమాలో నటించింది. యశ్‌తో నటించే చాన్స్‌  కోసం శ్రీ లీల ఎదురు చూస్తోంది.


👉: దగ్గుబాటి ఫ్యామిలీకి శ్రీ లీల దూరపు బంధువు. రానా దగ్గుబాటి ఆ మధ్య తన రియాలిటీ షోలో– తను ఏ బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కి వెళ్ళినా, శ్రీ లీల కనబడుతుందని కామెంట్‌ చేశారు. అలాగే డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడితో కూడా శ్రీ లీలకి బంధుత్వం ఉంది.

👉: పుష్ప –2లో కిస్సిక్‌ సాంగ్‌తో ఆడియన్స్‌ని వెర్రెక్కించిన శ్రీ లీలకి ఐటమ్‌ సాంగ్స్‌ కొత్త కాదు. పునీత్‌ రాజ్‌ కుమార్‌ నటించిన జేమ్స్‌ సినిమాలో మొదటిసారి ఐటమ్‌ సాంగ్‌ చేసింది.

👉: డాన్స్‌ అంటే విపరీతమైన పిచ్చి. మంచి బీట్‌ ఉన్న సాంగ్‌ వినబడితే చాలు– బాడీ ఆటోమేటిక్‌గా డాన్స్‌ చేస్తుంది. ఆ క్వాలిటీయే– ఆది కేశవ సినిమాలో హీరోయిన్‌ క్యారెక్టరైజేషన్‌కి పెట్టారు.

👉: పుష్ప –2లో ఐటమ్‌ సాంగ్‌ చేసి, సమంతని రీ ప్లేస్‌ చేసింది. కిస్సిక్‌ సాంగ్‌కు రెండు కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుందని టాక్‌.

👉: తను ఇంత వరకూ చేసిన క్యారెక్టర్స్‌లో భగవంత్‌ కేసరిలోని పాత్ర, సాంగ్స్‌లో కిస్సిక్‌ సాంగ్‌ బాగా ఇష్టమని శ్రీ లీల చెప్పింది.

👉: నితిన్‌తో రాబిన్‌హుడ్‌ సినిమాలో నటిస్తోంది. నితిన్‌తో రెండో సినిమా. నిజానికి రాబిన్‌హుడ్‌లో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేయాలి. మొదట షూటింగ్‌ మొదలైనప్పుడు– రష్మిక హీరోయిన్‌. తర్వాత శ్రీ లీల రష్మికని రీ ప్లేస్‌ చేసింది.

👉: పుష్ప–2 ఐటమ్‌ సాంగ్‌ షూటింగ్‌లో మొదటిసారి రష్మికని కలిసినప్పుడు– రాబిన్‌హుడ్‌ రీ ప్లేస్‌మెంట్‌ గుర్తు వచ్చి, శ్రీ లీల ఇబ్బంది పడింది. అయితే డేట్స్‌ ప్రాబ్లమ్‌ వల్ల తనే రాబిన్‌హుడ్‌ సినిమా వదిలేశానని, రష్మిక చెప్పడంతో ఊపిరి పీల్చుకుందట శ్రీ లీల.

👉: బై టూ లవ్‌ అనే కన్నడ సినిమా షూటింగ్‌ చేస్తున్నప్పుడు– ఓ అనాథ శరణాలయానికి వెళ్లింది. అక్కడి అనాథలను చూసి చలించి, బుద్ధిమాంద్యం ఉన్న ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. తన జీవితంలో హ్యాపీయెస్ట్‌ మూమెంట్‌ అదే అని చెప్పింది శ్రీ లీల.

👉: తను చేసిన గుంటూరుకారం, పుష్ప–2, ధమాకా సాంగ్‌లా కోట్లాది వ్యూస్‌తో టాప్‌ ప్లేస్‌లో ఉండటం బాగా కిక్కు ఇచ్చిన మేటర్‌ అంటుంది శ్రీ లీల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement