మహేశ్‌ సరసన ఇండోనేషియా బ్యూటీ  | Indonesian beauty in Rajamouli Next Movie | Sakshi
Sakshi News home page

మహేశ్‌ సరసన ఇండోనేషియా బ్యూటీ 

Feb 12 2024 1:15 AM | Updated on Feb 12 2024 10:48 AM

Indonesian beauty in Rajamouli Next Movie - Sakshi

హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్‌ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ ఓ హీరోయిన్‌గా నటిస్తారనే వార్త కొన్ని రోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్త నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో రాజమౌళిని ఫాలో అవుతున్నారు చెల్సియా. అలాగే మహేశ్‌బాబు– రాజమౌళి సినిమాల అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాలో చెల్సియా ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో మహేశ్‌కు జోడీగా చెల్సియా ఆల్మోస్ట్‌ కన్ఫార్మ్‌ అంటున్నారు ఫిల్మ్‌నగర్‌ వాసులు. కేఎల్‌ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్‌ ఈ ఏడాది వేసవిలో ప్రారంభం కానుందట.

Advertisement
 
Advertisement
Advertisement