‘ఇండియన్‌ 2’.. తైవాన్‌ టు సౌతాఫ్రికా

Indian 2 Makers To Shoot A Big Action Scene In South Africa - Sakshi

తైవాన్‌కు బై బై చెప్పాడు భారతీయుడు. 1996లో వచ్చిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లోనే ‘ఇండియన్‌ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌ సింగ్, బాబీ సింహా, బెనెడిక్ట్‌ గారెట్, గుల్షన్‌ గ్రోవర్‌ కీ రోల్స్‌ చేస్తున్నారు.

ఇటీవల తైవాన్‌లో మొదలైన ‘ఇండియన్‌ 2’ షెడ్యూల్‌ ముగిసింది. ఈ షూటింగ్‌ షెడ్యూల్‌లో కమల్‌హాసన్‌ పాల్గొనగా, కొన్ని కీలక సన్నివేశాలతో పాటు విదేశీ ఫైటర్స్‌తో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. తైవాన్‌ షెడ్యూల్‌ తర్వాత యూనిట్‌ సౌతాఫ్రికా వెళ్తుందని, అక్కడి లొకేషన్స్‌లో మరో యాక్షన్‌ సీక్వెన్స్‌ను ప్లాన్‌ చేసిందనికి వినికిడి. ఈ చిత్రాన్ని సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్‌ కలిసి నిర్మిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top