RGV-Ladki Movie: ఆర్జీవీ 'లడ్కీ' సినిమా ప్రదర్శనపై నిషేధం..

Hyderabad City Civil Court Stay On Ram Gopal Varma Ladki Movie - Sakshi

Civil Court Stay On Ram Gopal Varma Ladki Movie: ప్రముఖ దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన "లడ్కీ (అమ్మాయి)" సినిమాపై కోర్టు స్టే విధించింది. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో వర్మ నిర్మించిన ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ నిర్మాత కె. శేఖర్ రాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైదరాబాద్‌ సిటీ సివిల్ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో "సాఫ్ట్ వేర్ సుధీర్" సినిమాను  నిర్మించిన తాను రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాను  నిర్మించాలని సంకల్పించానని, ఆ మేరకు ఆయనను కలిశానని శేఖర్ రాజు వెల్లడించారు. 

అయితే తన దగ్గర సినిమా కోసం పలు దఫాలుగా లక్షలాది రూపాయలు తీసుకున్న వర్మ ఎప్పటికప్పుడు దాటవేస్తూ, తప్పించుకుంటూ వస్తున్నారని, శేఖర్ రాజు వివరించారు. తన డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, సరిగ్గా సమాధానం కూడా చెప్పడం లేదని, దాంతో తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్‌తో కోర్టును ఆశ్రయించానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న సిటీ సివిల్ కోర్టు ''లడ్కీ" సినిమాను అన్ని భాషల్లో ప్రదర్శనను నిలుపివేస్తూ, ఆర్డర్స్ జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. అలాగే అన్నిరకాల డిజిటల్, ప్లాట్ ఫామ్స్‌లో సినిమాను అమ్మడానికి కానీ, బదిలీ చేయడానికి కానీ, ప్రదర్శించడానికి  వీలులేకుండా  తాత్కాలిక నిషేధం విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన తెలిపారు. కాగా లడ్కీ చిత్రం జులై 15న విడదలై పాజిట్‌వ్‌ టాక్‌తో సందడి చేస్తోంది. 

చదవండి: 👇
పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ..

అప్పటి నుంచి సినిమా షూటింగ్‌లు బంద్‌..!
బ్యాడ్ న్యూస్‌ చెప్పిన నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌.. 
స్టార్ హీరోయిన్‌ సోదరుడితో ఇలియానా డేటింగ్‌ !.. ఫొటోలు వైరల్‌
మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top