Ileana Dating With Katrina Kaif Brother Sebastian Laurent Michel - Sakshi
Sakshi News home page

Ileana: హీరోయిన్ బ్రదర్‌తో ఇలియానా డేటింగ్‌ !.. ఫొటోలు వైరల్‌

Jul 17 2022 5:51 PM | Updated on Jul 17 2022 6:48 PM

Ileana Dating With Katrina Kaif Brother Sebastian Laurent Michel - Sakshi

ఇలియానా.. టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌గా చెలామణి అయింది ఈ గోవా బ్యూటీ. 'దేవదాస్‌' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ యూత్‌ను 'పోకిరీ'లుగా మార్చేసింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది.

Ileana Dating With Katrina Kaif Brother Sebastian: ఇలియానా.. టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌గా చెలామణి అయింది ఈ గోవా బ్యూటీ. 'దేవదాస్‌' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ యూత్‌ను 'పోకిరీ'లుగా మార్చేసింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరోయిన్‌ బ్రదర్‌తో ఈ గోవా బ్యూటీ డేటింగ్‌లో ఉన్నట్లు ఇంగ్లీష్‌ వెబ్‌సైట్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

బాలీవుడ్‌ భామ కత్రీనా కైఫ్‌ సోదరుడుల సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్‌తో ఇలియానా లవ్‌ ట్రాక్‌ నడిపిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ ఏడాది కత్రీనా తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కోసం భర్త విక్కీ కౌశల్, బ్రదర్‌ సెబాస్టియన్‌, ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లింది. ఈ వేడుకల్లో ఇలియానా కూడా పాల్గొంది. సెబాస్టియన్‌తో కలిసి సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను కత్రీనా, ఇలియానా ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. 

చదవండి: పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ..
వెబ్‌ వీక్షకులు ఎక్కువగా సెర్చ్‌ చేస్తున్న ఈమె ఎవరో తెలుసా ?


నెట్టింట తెగ వైరల్‌ అయిన ఈ ఫొటోలను చూసిన నెటిజన్స్‌ 'ఎలాంటి సంబంధం లేకుండా ఇలియానా బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఎందుకు పాల్గొంది?' అని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇలియానా, సెబాస్టియన్‌ 6 నెలలుగా డేటింగ్‌ చేస్తున్నట్లు పలు వెబ్‌సైట్‌లలో వార్తలు వచ్చాయి. మరోవైపు సెబాస్టియన్‌ ఇన్‌స్టా అకౌంట్‌ను గత కొంతకాలంగా ఇలియానా ఫాలో అవుతోంది. కాగా ఈ గోవా సుందరి గతంలో ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం జరిపిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల డేటింగ్‌ తర్వాత వీరిద్దరూ 2019లో విడిపోయారు. అయితే ఆండ్రూ, ఇలియానా పెళ్లి చేసుకునే విడిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. 

చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్‌
అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement