దసరా పూజలు.. ఫొటోలు షేర్‌ చేసిన దిల్‌రాజ్‌ భార్య | Dil Raju Wife Tejaswini Vygha Dasara Celebrations Photos | Sakshi
Sakshi News home page

Dil Raju Wife Tejaswini: నవరాత్రుల్లో దిల్‌రాజు ఫ్యామిలీ.. ఫోటోలు షేర్‌ చేసిన తేజేస్విని

Oct 12 2026 8:11 PM | Updated on Oct 12 2026 8:20 PM

Dil Raju Wife Tejaswini Vygha Dasara Celebrations Photos

దసరా నవరాత్రుల వేళ ఇళ్లలో పండుగ సందడి నెలకొంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ భక్తులు భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లోనూ దసరా వేడుకలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. ఆయన భార్య తేజస్విని వ్యాఘ తమ ఇంటి వద్ద అమ్మవారి మండపాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇప్పుడీ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

నవరాత్రుల్లో మొదటి రోజు పూజ అనంతరం తేజస్విని తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి మండపం వద్ద ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా అమ్మవారి పూజలు నిర్వహిస్తూ కుటుంబంతో కలిసి పండగను నిర్వహించుకున్న తేజస్విని ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

(ఇదీ చదవండి: ‘ఇరుముడి’ లాంటి సినిమా.. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌కి 17 రెట్లు వసూళ్లు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement