breaking news
Tejeswini
-
దసరా పూజలు.. ఫొటోలు షేర్ చేసిన దిల్‌రాజ్ భార్య
దసరా నవరాత్రుల వేళ ఇళ్లలో పండుగ సందడి నెలకొంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ భక్తులు భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లోనూ దసరా వేడుకలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. ఆయన భార్య తేజస్విని వ్యాఘ తమ ఇంటి వద్ద అమ్మవారి మండపాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.నవరాత్రుల్లో మొదటి రోజు పూజ అనంతరం తేజస్విని తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి మండపం వద్ద ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా అమ్మవారి పూజలు నిర్వహిస్తూ కుటుంబంతో కలిసి పండగను నిర్వహించుకున్న తేజస్విని ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.(ఇదీ చదవండి: ‘ఇరుముడి’ లాంటి సినిమా.. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌కి 17 రెట్లు వసూళ్లు) View this post on Instagram A post shared by Tejaswini Vundavalli (@tejaswini_vygha) -
భారత్ స్వర్ణాల వేట మొదలైంది..
-
బాలకృష్ణ చిన్న కుమార్తె వివాహం
-
బాలకృష్ణ చిన్న కుమార్తె వివాహం
హైదరాబాద్: సినీనటుడు నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని వివాహం మతుకుమిల్లి శ్రీభరత్‌తో ఈ ఉదయం 8.52కు హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి పలువురు కేంద్ర మంత్రులతోపాటు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరయ్యారు. శ్రీభరత్ కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు సోదరి కుమారుడు, విశాఖపట్నం టీడీపీ నాయకుడు ఎంవీఎస్ మూర్తికి మనుమడు. ఈ సంబంధాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుదిర్చారు. బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణికి, చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు 2007 ఆగస్టులో వివాహం జరిగిన విషయం తెలిసిందే.


