దసరా వేళ.. ప్రియాంక చోప్రా కూతురిని చూశారా? | Priyanka Chopra Celebrates Dussehra with her family in Los Angeles | Sakshi
Sakshi News home page

దసరా పూజలు.. ఫొటోలు షేర్‌ చేసిన ప్రియాంక చోప్రా

Oct 21 2026 7:55 PM | Updated on Oct 21 2026 8:08 PM

Priyanka Chopra Celebrates Dussehra with her family in Los Angeles

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా విజయదశమి పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నారు. లాస్‌ ఏంజెలెస్‌లోని తన నివాసంలో భర్త, హాలీవుడ్‌ నటుడు నిక్‌ జోనాస్‌, కుమార్తె మాలతీ మేరీ చోప్రా జోనాస్‌తో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి మాలతీ ఫొటోలను ప్రియాంక సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ చిత్రాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ 
ప్రియాంక చోప్రా, నిక్‌ జోనాస్‌ 2018లో జోధ్‌పుర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2022లో సరోగసీ ద్వారా వీరికి కుమార్తె మాలతీ జన్మించింది. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ భారతీయ పండగలు, సంప్రదాయాలకు ప్రియాంక ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను నిక్‌ గౌరవిస్తారని, ఆ పరస్పర గౌరవమే తమ బంధాన్ని మరింత బలోపేతం చేసిందని ప్రియాంక గతంలో ఓ సందర్భంలో పేర్కొన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రియాంక ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’లో నటిస్తున్నారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక.. ఈ సినిమాతో భారతీయ ప్రేక్షకులకు మరింత చేరువ కానున్నారు.

(ఇదీ చదవండి: ఫౌజీ అప్‌డేట్‌.. ఆ హారర్‌ సినిమాకి వెళ్లి చూడచ్చు: నిర్మాత)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement