Upasana Konidela: 'ఓ మై గాడ్ మీకు అలా అర్థమైందా'.. పిల్లలపై ఉపాసన క్లారిటీ..

Upasana Konidela Gave Clarity On Childrens: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మెగా కోడలిగానే కాకుండా సామాజిక అంశాల్లో చురుగ్గా పాల్గొంటుంది. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా పిల్లలపై తనకు వచ్చే ప్రశ్నల గురించి సద్గురు వద్ద ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇందులో సద్గురు 'ఆమెకు సమాధానంగా ప్రస్తుతం పెరిగిపోతున్న జనాభా వల్ల పిల్లలను కనకపోవడమే మంచింది. ఇలా పిల్లలను వద్దనుకునేవారికి అవార్డు ఇస్తాను' అని తెలిపారు.
అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు జనాభా తగ్గించడం కోసమే ఉపాసన దంపతులు పిల్లలను వద్దనుకుంటున్నారా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. అయితే తన గురించి ఈ కామెంట్లపై ఉపాసన తాజాగా స్పందించారు. 'ఓ మై గాడ్, ఇది నిజం కాదు. దయచేసి నేను ఏమన్నానో నిర్ణయానికి వచ్చే ముందు పూర్తి వీడియోను చూడండి' అని రాసుకొచ్చారు. అలాగే పిల్లలు వద్దనుకునే వాళ్లకు సద్గురు అవార్డు ఇస్తానని చెప్పారు. అయితే 'ఆ అవార్డు తీసుకునేందుకు మా తాతయ్య ఒప్పుకోవడం లేదు' అని ఇదివరకే ఉపాసన పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ బహుమానం వద్దంటే పిల్లలు కావాలని అర్థం అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్
రామ్ గోపాల్ వర్మ 'లడ్కీ'కి హిట్ టాక్.. మరిన్ని థియేటర్లలో..
An absolute honour to be in conversation with @SadhguruJV amazing as usual, every topic made so much sense. Truly practical considering the circumstances the world is facing today. A must watch !
Sadhguru-Thatha’s not letting me accept your award 🤗❤️
Thank you #ATA pic.twitter.com/Xvl7K9W3Yb
— Upasana Konidela (@upasanakonidela) July 4, 2022