
విరాట పర్వం సినిమా బ్యాన్ చేయాలని కోరుతూ సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలో శాంతి భద్రతలకు భంగం కల్గించేలా ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులను సైతం కించ పరిచే సన్నివేశాలు ఉన్నట్లు తెలిపారు. సినిమా ప్రదర్శనను వెంటనే ఆపివేయాలని కోరారు.
సాక్షి, హైదరాబాద్: విరాటపర్వం అనే సినిమాకు అనుమతులు ఇచ్చిన సెన్సార్ బోర్డు అధికారి శిఫాలి కుమార్ పై శ్వహిందూ పరిషత్ విద్యానగర్ జిల్లా కార్యదర్శి కె.అజయ్ రాజ్ సుల్తాన్‌బజార్ పోలీసులకు శనివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. నిషేధిత సంస్థలైన నక్సలిజం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే సినిమాలకు సెన్సార్ బోర్డు ఎలా అనుమతులు ఇస్తుందని ఆయన ప్రశ్నించారు.
ఈ సినిమా బ్యాన్ చేయాలని కోరుతూ సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. విరాట పర్వం సినిమా శాంతి భద్రతలకు భంగం కల్గించేలా ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులను సైతం కించ పరిచే సన్నివేశాలు ఉన్నట్లు తెలిపారు. ఈ సినిమాలో చాలావరకు అభ్యంతర మైన సన్నివేశాలు ఉన్నందున సినిమా ప్రదర్శనను వెంటనే ఆపివేయాలని కోరారు.
చదవండి: Sai Pallavi: నటి సాయిపల్లవిపై ఫిర్యాదు