ఈ కథ వినగానే అలా అనిపించింది: పి. సునీల్‌కుమార్‌ రెడ్డి

Honey Trap Movie Audio CD Launched By RP Patnaik And Raghu kunche - Sakshi

రిషి, శిల్పా నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హనీ ట్రాప్‌’. పి. సునీల్‌కుమార్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. భరద్వాజ్‌ సినీ క్రియేషన్స్‌ పతాకంపై వీవీ వామనరావు నిర్మించారు. ప్రవీణ్‌ ఇమ్మడి స్వరపరచిన ఈ చిత్రంలోని పాటలను  సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె విడుదల చేశారు. పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘వామనరావుగారు ‘హనీ ట్రాప్‌’ కథ  చెప్పగానే సినిమాకి కావాల్సిన వాణిజ్య అంశాలున్నాయనిపించింది.

ఆయన రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు. ఎందరో జీవితాలను దగ్గరగా చూసి, అందులోంచి కథలు రాస్తుంటారు. ఆయన రాసిన నాటకాలకు నంది ఆవార్డులు వచ్చాయి. సీరియల్స్‌ జనాదరణ పొందాయి. అలాంటి వ్యక్తి అందించిన కథతో సినిమా తీయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ నేను రాసిన స్క్రీన్‌ ప్లే బాగుందని దర్శకులు ప్రోత్సహించారు. ‘హనీ ట్రాప్‌’ ప్రివ్యూ చూసినవాళ్లంతా చాలా బాగుందన్నారు’’ అన్నారు వీవీ వామనరావు. రచయిత యెక్కలి రవీంద్ర బాబు, నటుడు శివ కార్తీక్, శ్రీలక్ష్మీ ఫిలింస్‌ బాపిరాజు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top