'దేవర' షూటింగ్‌లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు | Honey Bees Attacked Junior Artists At Jr. NTR Devara Movie Shooting | Sakshi
Sakshi News home page

'దేవర' షూటింగ్‌లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు

May 6 2024 7:26 PM | Updated on May 6 2024 7:56 PM

Honey Bees Attacked Junior Artists At Jr. NTR Devara Movie Shooting

పాన్‌ ఇండియా హీరో ఎన్టీఆర్‌- కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తర్వాత వస్తున్న సినిమా కావడంతో తారక్‌ ఫ్యాన్స్‌ క్రేజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌  వైజాగ్‌లో జరుగుతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అటవి ప్రాంతంలో దేవర షూటింగ్‌ జరుగుతున్న సమయంలో జూనియర్‌ ఆర్టిస్టులపై తేనెటీగలు దాడి చేసినట్లు తెలుస్తుంది. షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న 20 మందికి పైగా గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వారందరూ కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారట. ప్రమాదం జరిగిన సమయంలో జూ ఎన్టీఆర్‌ లేరు. ఆయన ప్రస్తుతం 'వార్‌2' సెట్స్‌లో ఉన్నారు.

జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న దేవరలో ప్రకాష్‌ రాజ్, శ్రీకాంత్, నరైన్, సైఫ్‌ అలీఖా న్ , టామ్‌ షైన్‌ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజాగ్‌ షెడ్యూల్‌లో తొలుత ఎన్టీఆర్‌ పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. చిత్ర యూనిట్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement