
హోంబలే ఫిల్మ్స్ సంస్ధ నిర్మిస్తున్న భారీ యానిమేటెడ్ చిత్రం 'మహావతార్: నరసింహ'.. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది. ఆపై సినిమా రిలీజ్ తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. కేజీఎఫ్,సలార్,కాంతార వంటి భారీ ప్రాజెక్ట్‌లను నిర్మించిన ఆ సంస్థ దర్శకుడు అశ్విన్ కుమార్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీమియర్‌ను గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(ఇఫ్ఫీ)లో ప్రదర్శించారు.
పాన్ ఇండియా రేంజ్‌లో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో జులై 25న ఈ చిత్రం విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. సామ్ సీఎస్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్‌లు నిర్మిస్తున్నారు. మహావతార్ సిరీస్‌లో భాగంగా వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అయితే, ఈ కథకు సీక్వెల్‌గా ఇతర అవతారాలతో పలు సినిమాలు రానున్నాయన మేకర్స్ హిట్ ఇచ్చారు. యానిమేషన్‌లో ఈ చిత్రం ఒక బెంచ్ మార్క్‌ను సెట్ చేస్తుందని దర్శకుడు తెలిపారు.

ప్రహ్లాదుడి చరిత్ర, విష్ణువుకు, హిరణ్యకశిపునికి మధ్య జరిగిన యుద్ధాన్ని ఇందులో చూపిస్తున్నట్లు అశ్విన్ చెప్పారు. దీన్ని రూపొందించడానికి సుమారు నాలుగు సంవత్సరాలు పట్టింని ఆయన చెప్పారు. మహావతార్ సిరీస్‌లో రానున్న తొలి సినిమాగా 'మహావతార్: నరసింహ' తెరకెక్కింది. దీనికి కొనసాగింపుగా ఇతర అవతారాలతో మరో రెండు సినిమాలు రాబోతున్నట్లు తెలుస్తోంది.