ఓటీటీలో టాప్‌ డైరెక్టర్‌ కుమారుడి తొలి సినిమా | Vijay Kanishka Hit List Movie OTT Release Date, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Hit List Movie In OTT: ఓటీటీలో టాప్‌ డైరెక్టర్‌ కుమారుడి తొలి సినిమా

Jul 5 2024 7:41 AM | Updated on Jul 5 2024 9:25 AM

Hit List Movie OTT Streaming Date Locked

దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ తన ఆర్కే సెల్యులాయిడ్స్‌ పతాకంపై  తాజాగా 'హిట్‌ లిస్ట్‌' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో నటుడు శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో మెప్పించారు.  ఈ  చిత్రం ద్వారా టాప్‌ దర్శకుడు విక్రమన్‌ వారసుడు విజయ్‌ కనిష్క హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీకి రవికుమార్‌ శిష్యులు సూర్య, కార్తికేయన్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. మే 31న థియేట‌ర్ల‌లో తెలుగు, త‌మిళంలో ఒకే రోజు విడుదలైన ఈ సినిమా  బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా మెప్పించలేదు. ఇప్పుడు ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది.

దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, సముద్ర ఖని, మునీశ్కాంత్‌, నటి సితార, కేజీఎఫ్‌ చిత్రం ఫేమ్‌ గరుడ రామచంద్రా, అనుపమా కుమార్‌ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీగా తెరకెక్కిన 'హిట్‌లిస్ట్' సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. జూలై 9 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు,తమిళ్‌ రెండూ భాషల్లో ఒకేరోజు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement