ఎంతో అందంగా ఉండే సౌందర్యను అలా చూడలేకపోయా : ప్రేమ | Kannada Actress Prema Emotional About Late Actress Soundarya Death - Sakshi
Sakshi News home page

Heroine Prema : 'సౌందర్య చివరి రోజుల్లో అలా.. వాచ్‌ను బట్టి డెడ్‌బాడీని గుర్తుపట్టారు'

Apr 14 2023 10:45 AM | Updated on Apr 14 2023 11:50 AM

Heroine Prema Emotional About Late Actress Soundarya Death - Sakshi

హీరోయిన్‌ ప్రేమ పేరు వినగానే మొదటగా దేవి సినిమానే గుర్తుకొస్తుంది. నిజానికి ఆమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా స్టార్‌డమ్‌ సంపాదించుకుంది. కన్నడ, తెలుగు, మలయాళ సినిమాలతో తనకంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ప్రేమ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. 2017లో మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. అయితే ఒకటి, రెండు సినిమాల్లో కనిపించిన ఆమె మళ్లీ స్క్రీన్‌కు దూరమయ్యారు.

ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటున్న ప్రేమ తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి, విడాకులు, కెరీర్‌.. ఇలా పలు విషయాలపై ఓపెన్‌ అయ్యింది. ఈ క్రమంలో దివంగత నటి సౌందర్య మరణాన్ని తలుచుకొని ఎమోషనల్‌ అయ్యింది. ''సౌందర్య చనిపోయిన రోజు.. ఇంతేనా జీవితం అనిపించింది. చివరి చూపు కోసం వాళ్ల ఇంటికి వెళ్లాను. సౌందర్య, ఆమె సోదరుడు డెడ్‌బాడీలను బాక్స్‌లో పెట్టి ఉంచారు.

చూడటానికి ఫేస్‌ కూడా లేదు. ఇంతేనా ఆర్టిస్ట్‌ జీవితం అనిపించింది. మనం పోయేటప్పుడు తీసుకెళ్లేది కర్మ, గౌరవం మాత్రమే. సౌందర్య చేతికి పెట్టుకున్న గడియారాన్ని బట్టి అది సౌందర్య డెడ్‌బాడీ అని గుర్తించారు. అందంగా కనిపించడానికి సౌందర్య ఎంతో ఇష్టపడేవారు.షూటింగ్‌లో షాట్‌ గ్యాప్‌లో కూడా ఎప్పటికప్పుడు టచప్ చేసుకుంటూ అన్నీ పర్ఫెక్ట్ లా ఉండాలని అనుకునేవారు. అలాంటిది చివరి రోజుల్లో ఆమె ముఖం కూడా లేదు. అవన్నీ తలుచుకుంటే బాధేస్తుంది'' అంటూ ప్రేమ పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement