Actor Nikhil Siddharth Reacts On Karthikeya 2 Movie Result - Sakshi
Sakshi News home page

‘కార్తికేయ 2’ హిట్‌ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు: నిఖిల్‌

Aug 14 2022 1:33 PM | Updated on Aug 14 2022 2:33 PM

Hero Nikhil Siddharth Talk About Karthikeya 2 Movie - Sakshi

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన చిత్రం కార్తికేయ‌ 2. భారీ అంచనాల మధ్య ఈ శనివారం(ఆగస్ట్‌ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే హిట్‌ టాక్‌ సంపాదించుకుంది. దీంతో విడుదలైన రోజు సాయంత్రమే చిత్రబృందం థాంక్స్‌ మీట్‌ నిర్వహించింది.  ఈ సందర్భంగా హీరో నిఖిల్‌ మాట్లాడుతూ.. తమ సినిమాని సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ మంచి కలెక్షన్స్‌ రాబట్టడం సంతోషంగా ఉందన్నారు.

(చదవండి: ‘ కార్తికేయ2 ’ మూవీ రివ్యూ)

‘​యూఎస్‌లో కార్తికేయ2కి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అయినప్పటికీ కొంచెం టెన్షన్‌గా ఫీలయ్యాను. తెలుగు ప్రేక్షకులు మా సినిమాని ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని భయపడ్డాను. కానీ మీడియా షో అవ్వగానే నాకు ఫోన్‌ కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. అన్ని చోట్ల హౌస్‌ఫుల్‌ అవుతున్నట్లు రిపోర్ట్స్‌ వస్తున్నాయి. నా సినిమా హిట్‌ అవ్వాలని చాలామంది కోరుకున్నారు. రేపు, ఎల్లుండి కూడా బుకింగ్స్‌ బాగున్నాయి. ఇది ఇలానే కొనసాగుతుందని అనుకుంటున్నాను. చందు మంచి పాయింట్‌ని తీసుకొని సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా కోసం కష్టపడిన టెక్నీషియన్స్‌ అందరికి థ్యాంక్స్‌’అని అన్నాడు.

నిర్మాత‌ల్లో ఒక‌రైన అభిషేక్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ, కార్తికేయ-2 విజ‌యం నారాయణ దాస్ నారంగ్ గారికి అంకితం ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు. విడుద‌లైన ప్ర‌తిచోట్ల, ఓవ‌ర్‌సీస్‌లోనూ మంచి ఆద‌ర‌ణ పొందుతోంద‌ని తెలిపారు.

హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌ మాట్లాడుతూ.. దర్శకుడు చందు మొండేటి కథ చెప్పిన దానికంటే అద్భుతంగా ఈ సినిమాను తీశారు. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. సినిమాకి అని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెబుతున్నారు. కార్తికేయ 2 సాంకేతిక నిపుణలకు కృతజ్ఞతలు’ అన్నారు.

దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ.. రెండు పాండమిక్స్ తరువాత ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా సక్సెస్ తో ఆ కష్టం అంతా మర్చిపోయాను. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement