సింగిల్ క్యారెక్టర్‌తో వస్తున్న 'హలో మీరా'.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్  | Hello Meera Movie First Look Poster Release Today | Sakshi
Sakshi News home page

Hello Meera Movie: ఆకట్టుకుంటున్న 'హాలో మీరా' ఫస్ట్ లుక్ పోస్టర్

Oct 5 2022 8:57 PM | Updated on Oct 5 2022 9:08 PM

Hello Meera Movie First Look Poster Release Today - Sakshi

సింగిల్ క్యారెక్టర్‌ మూవీ 'హలో మీరా'తో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు కాకర్ల శ్రీనివాసు. గార్గేయి యల్లాప్రగడ ప్రధాన పాత్రలో ఓ వైవిధ్యభరితమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో ప్రధాన పాత్ర అయిన మీరాను చూపిస్తూ కథలోని కోణాన్ని చూపించారు. కేవలం సింగిల్ క్యారెక్టర్‌తో సినిమాను నడిపించడమే ప్రత్యేకత. సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్‌గా కథ మొత్తం కూడా మీరా అనే పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఈ పోస్టర్‌లో మీరా వెనకాల కనిపిస్తున్న ప్రకాశం బ్యారేజ్, ఆకాశంలో పక్షులు ఎగురు తుండటం చూస్తుంటే ఈ సినిమాలో ఊహకందని సస్పెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతినిస్తుందని దర్శకుడు అంటున్నారు.అతి త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.  సూరి సాధనాల అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement