Sasanasabha Movie: Nannu Pattukunte (Telugu) Song Out Now - Sakshi
Sakshi News home page

సొట్టబుగ్గలున్న అగ్గిపెట్టే నేను..

Nov 14 2022 1:14 AM | Updated on Nov 14 2022 8:46 AM

Hebah Patel Sasanasabha Lyrical Video Release - Sakshi

హెబ్బా పటేల్‌

‘నన్ను పట్టుకుంటే జారిపోతుంటాను... ఒంపుసొంపులున్న పాదరసమే నేను.. నన్ను ముట్టుకుంటే నిప్పునవుతుంటాను.. సొట్టబుగ్గలున్న అగ్గిపెట్టే నేను..’ అంటూ అదిరిపోయే స్టెప్పులు వేశారు హెబ్బా పటేల్‌. ఇంద్రసేన హీరోగా నటిస్తున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘శాసనసభ’. ఇందులో ఐశ్వర్యారాజ్‌ భకుని, రాజేంద్ర ప్రసాద్, సోనియా అగర్వాల్‌ ప్రధాన పాత్రలు పోషించారు.

తులసీరామ్‌ సప్పని, షణ్ముగం సప్పని నిర్మాతలు. రవి బసూర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నన్ను పట్టుకుంటే..’పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ స్పెషల్‌ సాంగ్‌లో హెబ్బాపటేల్‌ మంచి స్టెప్పులు వేశారు. కాసర్లశ్యామ్‌ సాహిత్యం అందించగా, మంగ్లీ, సంతోష్‌ వెంకీ, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ రవి బసూర్‌ పాడారు. ప్రేమ్‌రక్షిత్‌ నృత్యరీతులు సమకూర్చారు.

Advertisement
 
Advertisement
Advertisement