'Head Up High' First Single From Naga Chaitanya's Custody Is Out - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: పోలీసుల గొప్పతనం చాటేలా.. 'కస్టడీ' ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ విడుదల

Apr 11 2023 7:30 AM | Updated on Apr 11 2023 9:40 AM

Head Up High: First Single From Naga Chaitanya Custody Is Out - Sakshi

అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘కస్టడీ’. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెలుగు–తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతీశెట్టి కథానాయికగా నటిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ మే 12 విడుదలకానుంది.

మేస్ట్రో ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘హెడ్‌ అప్‌ హై..’ అంటూ సాగే తొలి లిరికల్‌ వీడియోని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను అరుణ్‌ కౌండిన్య, అసల్‌ కోలార్‌, యువన్‌ శంకర్‌ రాజా పాడారు.

‘‘హెడ్‌ అప్‌ హై..’ పాట పోలీసుల గొప్పతనాన్ని వర్ణిస్తుంది. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. నాగచైతన్య తన గ్రేస్‌ఫుల్‌ డ్యాన్స్‌ పాటలోని ఎనర్జీని మ్యాచ్‌ చేశారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. అరవింద్‌ స్వామి,ప్రియమణి, శరత్‌ కుమార్, సంపత్‌ రాజ్, ‘వెన్నెల’ కిషోర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఖతీర్‌. 

Advertisement
 
Advertisement
Advertisement