సినిమా చూస్తూ నవ్వుతూనే ఉన్నారు: హారిక సూర్యదేవర | Harika Suryadevara about Mad Square Movie | Sakshi
Sakshi News home page

సినిమా చూస్తూ నవ్వుతూనే ఉన్నారు: హారిక సూర్యదేవర

Mar 29 2025 3:47 AM | Updated on Mar 29 2025 3:47 AM

Harika Suryadevara about Mad Square Movie

రామ్‌ నితిన్, సంగీత్‌ శోభన్, నార్నే నితిన్, కల్యాణ్‌ శంకర్, హారిక, నాగవంశీ

‘మ్యాడ్‌ స్క్వేర్‌’ని కాలేజ్‌ స్టూడెంట్స్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా చూస్తూ నవ్వుతూనే ఉన్నారు. ఇలా మా కష్టానికి తగ్గ ఫలితం దక్కడం హ్యాపీగా ఉంది’’ అని హారిక సూర్యదేవర తెలిపారు. నార్నే నితిన్, సంగీత్‌ శోభన్, రామ్‌ నితిన్‌ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్‌ స్క్వేర్‌’. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్‌ స్క్వేర్‌’ సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

అన్ని షోలు హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. కొన్ని ఏరియాల్లో ‘మ్యాడ్‌’ మూవీ క్లోజింగ్‌ కలెక్షన్స్‌ ‘మ్యాడ్‌ స్క్వేర్‌’కి మాత్రం మొదటి రోజే వచ్చే అవకాశం ఉంది’’ అన్నారు. ‘‘థియేటర్లో ప్రేక్షకులంతా ఎంజాయ్‌ చేస్తుంటే... దీనికోసమే కదా మనం సినిమా తీసింది అనే అనుభూతి కలిగింది’’ అని కల్యాణ్‌ శంకర్‌ పేర్కొన్నారు. ‘‘థియేటర్‌లో ప్రేక్షకులు గోల చేసుకుంటూ సినిమా చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది’’ అన్నారు నార్నే నితిన్‌.

‘‘మా సినిమాపై ఇంతటి ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అని రామ్‌ నితిన్‌  చెప్పారు. ‘‘ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల చాలా ఆనందంగా ఉన్నాం’’ అన్నారు సంగీత్‌ శోభన్‌. ‘‘ఇలాంటి విజయవంతమైన సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది’’ అని ప్రియాంక జవాల్కర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement